ఆకర్షించే అందం, ఆకట్టుకొనే అభినయం .. రెండూ ఉన్నప్పటికీ అందాల ప్రగ్యా జైస్వల్ టాలీవుడ్ లో ఆశించిన రేంజ్ లో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. తొలి చిత్రం కంచె తర్వాత ఆమె ఖాతాలో అలాంటి స్థాయిలో మరో హిట్ పడలేదు. దాంతో అమ్మడికి ఇప్పటివరకూ స్టార్ స్టాటస్ రాలేదు. అయితే ఇప్పుడామె దశ తిరగినట్టే కనిపిస్తోంది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ప్రగ్యకి అవకాశాలొస్తున్నాయి.
బాలయ్య , బోయపాటి కలయికలో వస్తున్న మూడో సినిమా అఖండలో ప్రగ్య జైస్వల్ ఒక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే.. పవర్ స్టార్ సినిమాలో కూడా ప్రగ్య కథానాయికగా నటించబోతోందని టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన కూడా కంచె పాప అవకాశం అందుకుందని సమాచారం. దీంతో ప్రగ్య కెరీర్ నెక్స్ట్ లెవెల్ కు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ప్రగ్యా ఫోటో షూట్స్ వీటికి అదనపు ఆకర్షణగా మారాయి.
సోషల్ మీడియాలో తరచుగా తన హాట్ పిక్స్ ను షేర్ చేసే ప్రగ్యా జైస్వల్ .. బోలెడంత మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. తరుచుగా ఆమె పోస్ట్ చేసే సెన్సువల్ పిక్స్ కు కుర్రకారు ఫిదా అయిపోతుంటారు. ఈ నేపథ్యంలో తాజా గా ప్రగ్యా షేర్ చేసిన వైట్ మోనోకిని ఫోటోకి విపరీతమైన స్సందన లభించింది. సింగిల్ పీస్ బికినీలో అమ్మడి ఒంపు సొంపులు .. అదరహో అనిపిస్తున్నాయి.
Must Read ;- తన బికినీ షో పెద్ద రిలీఫ్ అంటోన్న హాలీవుడ్ హాటీ