విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం నారప్ప. ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతలు సురేష్ బాబు – కలైఫులి ఎస్ థాను సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ్ లో రూపొందిన అసురన్ మూవీకి రీమేక్ ఇది. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కి శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్ అని ప్రకటించగానే.. సెన్సిబుల్ డైరెక్టర్ భారీ యాక్షన్ మూవీని ఎలా డీల్ చేస్తాడు.? శ్రీకాంత్ కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించడం రాంగ్ ఛాయిస్ అన్నారు కొంత మంది. కానీ.. వెంకటేష్ నారప్పగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ సినిమా పై పాజిటివ్ టాక్ పెరిగింది. అలాగే శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు అనే టాక్ బయటకు వచ్చింది.
దీంతో నారప్ప పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను గత సంవత్సరమే ఈ సినిమా రిలీజ్ కావాలి కానీ.. కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో ఈ సంవత్సరంలో మే 14న రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఈసారి కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ వాయిదా పడింది. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుతుండడం.. జులై నుంచి థియేటర్లు ఓపెన్ అవుతాయి అని వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ఈ సినిమాలో వైవిధ్యమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో వెంకటేష్ కనిపించనున్నారు. ఇంత వరకూ చూడని కొత్త అవతారంలో ఆయన్ను చూపించనున్నారు శ్రీకాంత్ అడ్డాల.
వారం రోజుల్లో నారప్ప ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్స్‌తో పాటు వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన టీజర్‌కు మంచి స్పందిన లభించింది. ఇది అందరికీ నచ్చే చిత్రం అని శ్రీకాంత్ అడ్డాల తెలియచేశారు. తమిళంలో అసురన్ సక్సస్ సాధించినట్టుగానే తెలుగులో నారప్ప కూడా సక్సస్ అవ్వడం ఖాయమని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి.. నారప్పగా వెంకీ ఎంత వరకు ఆకట్టుకుంటారో చూడాలి.
Must Read ;- ‘డ్రైవింగ్ లైసెన్స్’ పై మనసు పారేసుకున్న వెంకీ?











