తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. హెలికాప్టర్ ద్వారా ఇవాళ సిద్దిపేట జిల్లాకు చేరుకున్నారు. పలు డెవలప్ మెంట్ పనులకు శంకుస్థాపనలు చేసిన ఆయన సిద్ధిపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. దాదాపు 4 కోట్ల వ్యయంతో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన ఎమ్మెల్యే కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం కొండ మండలం రాంపల్లిలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ను ప్రారంభించారు. సీఎం కేసీఆర్ వెంట ఎమ్మెల్యే రఘునందన్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. రేపు వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లి కాళోజీ యూనివర్సిటీ, వరంగల్ అర్బన్ కలెక్టరేట్ల భవనాలను ప్రారంభిస్తారు. మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజ కూడా చేయనున్నారు.
కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటామని స్థానిక నాయకులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా అరెస్టు చేశారు. సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ విద్యార్థి సంఘాల నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కేసీఆర్ పర్యటనకు అడ్డంకులు సృష్టించకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఏయే ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటన చేయనున్నారనే విషయాలు తెలుసుకొని, ముందస్తుగా స్థానిక నాయకులను అరెస్ట్ చేశారు. పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడంతో సిద్దిపేటలో సీఎం కేసీఆర్ పర్యటన సాఫీగా సాగుతోంది.
Must Read ;- ఎన్టీఆర్ పెట్టిన ఆ పథకం నాకు బాగా నచ్చింది : సీఎం కేసీఆర్











