నీ ఇంటికొచ్చా..నట్టింటికొచ్చా..చూడు, ఒకవైపే చూడు..కంటి చూపుతో చంపేస్తాననే బాలయ్య..తన హావభావాలతో ఓ ఇంటర్వ్యూలో అదరగొట్టాడు. కూల్‌గా సమాధానాలు చెబుతూనే..వాటిని చాలా సూటిగా చెప్పాడు. అయితే ఇప్పుడు ఆ ఎక్స్ ప్రెషన్స్‌కి..నవ్వులకు, కొత్త అర్ధాలు తీస్తూ సోషల్ మీడియాలో విపరీత అర్థాలు తీస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో యాక్టివ్ రోల్‌లోకి రావడం బాలకృష్ణకు ఇష్టం లేదని.. జూ.ఎన్టీఆర్ మైనస్ కావొచ్చన్నారని..అంటూ చెలరేగిపోతున్నారు.
అసలేం జరిగింది..
అసలేం జరిగింది? జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావాలని కొందరు కోరుతున్నారు..మీరేమంటారు అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగారు. (జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోనే ఉన్నారు. యాక్టివ్ రోల్ లోకి రావాలని కొందరు అభిమానులు ఈ మధ్య అప్పీల్ చేశారు). దానికి బాలకృష్ణ సమాధానమిస్తూ దానిదేముంది.. ఎవరైనా రావొచ్చు..అది పెద్ద విషయం కాదన్నట్లు మాట్లాడారు. ఓకె.. ఎన్టీఆర్ వస్తే పార్టీకి అది ప్లస్ అవుతుందా.. అని అడిగారు.. అప్పుడు బాలకృష్ణ చిక్కు ప్రశ్న వేశారన్నట్లుగా ఓ నవ్వు నవ్వారు.. తర్వాత ప్లస్ అవ్వొచ్చు..తర్వాత మైనస్ అవ్వొచ్చు… ప్లస్ మైనస్ కలిస్తే మైనస్..ప్లస్ ప్లస్ అయితే ప్లస్..మైనస్ మైనస్ అయితే ప్లస్.. అంటూ థియరీ చెప్పి నవ్వేశారు. తర్వాత వివరణ ఇస్తూ..యువతకు ప్రాధాన్యమీయాల్సిందే..చాలామంది యువత ఉన్నారు పార్టీలో.. ఐ యామ్ 61..అయినా ఐ యామ్ రెడీ టు లీడ్ దెమ్ అని చెప్పారు.
ఎన్టీఆర్‌ను ఆహ్వానిస్తూనే..యువతకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ..
ఒక విధంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానిస్తూనే..యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా బాలకృష్ణ చెప్పారు. అలాగే నందమూరి తారక రామారావు ఏనాడో స్థాపించిన పార్టీ..ఇంత ప్రస్థానం నడిపించిన పార్టీకి ఒక వ్యక్తి ప్లస్ కాని..మైనస్ కాని అవరని పరోక్షంగా చెప్పారు.ఎక్కడా జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని గాని.. వస్తే నష్టమని గాని అర్ధమొచ్చేలా ఆయనస్సలు మాట్లాడలేదు. అయినా అదే పనిగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
తెలుగు దేశంలో భాగమేనంటూ..
వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ తాను తెలుగు దేశంలో భాగమని అనేకసార్లు స్పష్టతనిచ్చారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎన్టీఆర్‌కు ఎంత క్లోజో అందరికీ తెలుసు. అయినా వారిద్దరూ ఇప్పుడు దూరమైనా పట్టించుకోవడం లేదు. వారిద్దరికి టిక్కెట్లు ఇవ్వాలని చంద్రబాబు దగ్గర పట్టుబట్టినవాడు..నేడు వారిద్దరూ వైసీపీలో ఉన్నాగాని..తాను మాత్రం తెలుగుదేశంతోనే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు పిల్లనిచ్చిన మామ కూడా ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ చెప్పేదే ఒకటే తాతగారు పెట్టిన పార్టీ.. ఆ పార్టీ కోసం తాను ఏమైనా చేస్తానని.
ఇప్పుడు ఈ సందర్భాన్ని పట్టుకుని సోషల్ మీడియాలో కొందరు..జూనియర్ ఎన్టీఆర్‌కు బాలకృష్ణకు,నారా ఫ్యామిలీకి మధ్య విబేధాలు సృష్టించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Must Read ;- జూనియర్ ఎన్టీఆర్ పై ఎందుకీ రాజకీయ ఒత్తిడి?











