అతడు సినిమాలో ఎం.ఎస్.నారాయణ డైలాగ్ ఒకటి భలే పేలింది.‘‘నా మానాన నేను మాడిపోయిన మసాలా దోశె తింటుంటే.. జ్యోతిలక్ష్మిని చూపించి చూపించనట్లుగా ఏం చెప్పకుండా గొడవ పడతారేంటరా’’ అని ..ఆ డైలాగ్ ఇప్పటికీ అందరూ చెప్పుకుంటున్నారు. కియా మోటార్స్ వాళ్లు కూడా అదే డైలాగ్ పట్టుకున్నారు.. ఇలా ‘‘మా మానాన మేము రెండు లక్షల కార్లను ఉత్పత్తి చేసి అమ్ముకుంటుంటే.. ఐపీఎల్ క్రికెట్ మాదిరి ఈ క్రెడిట్ కాంపిటీషన్ ఏంటండి’’ అంటున్నారు. విభజన తర్వాత పెట్టుబడుల కోసం చంద్రబాబునాయుడు కాలికి బలపం కట్టుకుని తిరిగారన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. ఈ విషయంలో ఎవరూ ప్రశ్నించలేరు. అమరావతికి ప్రణాళికలు వేస్తూనే..హార్డ్ వేర్,మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలను చిత్తూరు జిల్లాలో వచ్చేలా కృషి చేశారు.
మేకిన్ ఇండియా కాన్సెప్ట్, కొత్త పాలసీలు కూడా కలిసి రావడంతో..
ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్ ఇండియా కాన్సెప్ట్ రూల్స్, కొత్త పాలసీలు కూడా కలిసి రావడంతో.. కియా మోటార్స్‌కు ఏపీ ప్రభుత్వ ఆఫర్లు నచ్చి 2017లోనే ఒప్పందం చేసుకున్నారు. అంటే విభజన జరిగిన మూడేళ్లకు ఈ పరిణామం జరిగింది. ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకుని ఉత్పత్తి ప్రారంభించే సరికి జనవరి 2019 అయింది. జూలై 2019 నుంచి కార్లను మార్కెట్లోకి విడుదల చేసి సక్సెస్ ఫుల్ గా సేల్స్ చేసుకుంటోంది.
Must Read ;- తాడేపల్లి నుంచి జగన్ శాసిస్తే.. ఢిల్లీలో మోదీ పాటిస్తున్నారంట!
రాజశేఖర్ రెడ్డిగారే కియాతో మాట్లాడినట్లు..
2019లో గెలిచిన వైసీపీ.. చంద్రబాబునాయుడు పూర్తి ఫెయిల్యూర్ అని చెప్పడం కోసం.. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో ఒక అబద్ధాన్ని కొత్త విషయంలా చెప్పించారు. కొత్త ప్రభుత్వానికి కియా వారు ఫార్మల్‌గా మర్యాద కోసం రాసిన ఓ లెటర్‌ని అడ్డం పెట్టుకుని.. ఎప్పుడో రాజశేఖర్ రెడ్డిగారే కియాను రమ్మని మాట్లాడినట్లు.. ఆ మాటకే తొమ్మిదేళ్ల తర్వాత కంపెనీ వచ్చినట్లు కథ చెప్పుకొచ్చారు.అప్పుడే ఇదెక్కడి గొడవరా బాబూ అనుకున్నారు.
ఆ తర్వాత జూలైలో కార్లను మార్కెట్‌లో విడుదల చేసే కార్యక్రమానికి కియా వారు పిలిస్తే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేదో ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలా బిల్డప్ ఇచ్చి.. ఆ కంపెనీ తమ హయాంలోనే ప్రారంభించినట్లు కవరింగ్ ఇచ్చారు. అప్పుడు కూడా వివాదం చెలరేగింది. మరీ ఇంత చీప్‌గా బిహేవ్ చేస్తున్నారేంటని చాలామంది కామెంట్ చేశారు. ఇక హిందూపురం ఎంపీ మీసాల మాధవుడు అయితే ఇంకో స్టెప్ ముందుకేసి.. కియా వాళ్లనే బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. లోకల్ వాళ్లకు ఉద్యోగాలనే పేరుతో రచ్చ చేసి..ఏం డిమాండ్లు పెట్టారో తెలియదు గాని..తర్వాత ఆ ఎపిసోడ్ సైలెంట్ అయింది.
కియా కూడా వ్యూహాత్మకంగా..
అలా సైలెంట్ చేయడానికి కియా కూడా వ్యూహాత్మకంగా ఓ ట్రిక్ ప్లే చేశారు. వైసీపీ లోకల్ నేతలు, బడా నేతల కోరికలు, బ్లాక్ మెయిలింగులు ఎక్కువై పోవడంతో ఏపీ నుంచి తమిళనాడుకు షిఫ్ట్ అవ్వాలనే ప్రయత్నం చేసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్‌లో కథనం వచ్చేటట్లు చేశారని అంటారు. ఆ వార్త రాగానే కంగారుపడ్డ జగన్ సర్కార్… మాధవుడిని కంట్రోల్ చేశారు.
ఇప్పుడు మళ్లీ లేటెస్టుగా రెండేళ్లలో వచ్చిన పెట్టుబడులంటూ వైసీపీ మంత్రి గౌతమ్‌రెడ్డి కియాను కూడా తమ అకౌంట్లో వేసుకోవడంతో.. మాజీ మంత్రి లోకేష్ మండిపడ్డారు. తమ హాయాంలో ప్రారంభమైన వాటిని..ఒప్పందాలు కుదుర్చుకున్నవాటిని అన్నిటిని చూపించుకుంటున్నారని..అసలు వైసీపీ హయాంలో ఒక్కటీ రాలేదని ఆయన విమర్శించారు. మొత్తం మీద కియా కథ మళ్లీ గుర్తు చేసుకునేలా మంత్రి గౌతమ్‌రెడ్డి గారు రిపోర్టు ఇచ్చారు.
Also Read ;- పరిశ్రమ చంద్రబాబుది.. ప్రచారం జగన్‌ది: నారా లోకేష్