ప్రేమీ విశ్వనాథ్.. ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ ‘కార్తీక దీపం’ సీరియల్ లోని వంటలక్క అంటే మాత్రం.. సీరియల్స్ చూడని వారికి కూడా తెలుసు. తెలుగు మహిళా మణులు ఎన్ని పనులున్నప్పటికీ.. సాయంత్రం అయ్యేటప్పటికి పనిగట్టుకొని మరీ తమ పనులు ముగించుకొని టీవీలకు అతుక్కుపోతారు. అంతగా ఫేమస్ అయిపోయింది ‘కార్తీక దీపం’ సీరియల్. కార్తీక్ , దీప ఎప్పటికి కలుసుకుంటారో? అని తెగ ఇదైపోతుంటారు సీరియల్ వీక్షకులు. అంతలా మెప్పించిన ఆ సీరియల్ లోని వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ .. ఇప్పుడు అందరికీ అభిమాన నటీమణి.

‘కార్తీక దీపం’ సీరియల్ లో ఎంతో ఇన్నోసెంట్ గా, భారతీయ మహిళంటే అలాగే ఉండాలి అనుకునేంతగా అందరి మనసుల్ని దోచిన ప్రేమీ విశ్వనాథ్.. మలయాళం అమ్మాయి. అయితే ఆమె సీరియల్ లో కనిపించినంత ట్రెడిషనల్ గా మాత్రం బైట కనిపించదు. పర్సనల్ లైఫ్ లో ప్రేమీ విశ్వనాథ్ వేరు. ఆమెలో ఎంతో కొంటెతనం, చిలిపితనం కనిపిస్తాయి. ఎంతో చెలాకీగా, ఎనర్జిటిక్ గా కనిపిస్తూ.. తనలోని మరో కోణాన్ని బైటికి తీస్తుంది. రీసెంట్ గా ఆమె తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోసే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అందులో వంటలక్కని చూస్తున్నవారు షాక్ అవుతున్నారు.

అల వైకుంఠపురములో చిత్రంలో సిత్తరాలు సిరపడు అనే పాటలో బన్నీ గెటప్ ఎవరూ మరిచిపోలేరు. అందులో కోడిపుంజు ను స్టైల్ గా పట్టుకొని బన్నీ బీడీ కాల్చే సీన్ గుర్తుంది కదా.. ఆ గెటప్ ను యాజిటీజ్ ఫాలో అవుతూ.. ప్రేమీ విశ్వనాథ్ కోడిపుంజుతో మోడ్రన్ లుక్ లో రివీలై ఆశ్చర్యపరుస్తోంది. పూల చొక్కా , లుంగీ కట్టి.. చేతిలో సిగరెట్టు పట్టుకొని.. రింగులు రింగులుగా పొగ ఊదే తీరుకు అందరూ అవాక్కవుతున్నారు. ఆ గెటప్ లో ఆమె సూపరంటూ తెగ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Must Read ;- అందమంతా ఈ సుందరి చీరకట్టులోనే ఉన్నది!












