మతం కంటే మానవత్వమే గొప్పదని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమలు జరుపుతున్న కార్యక్రమాలను మేనేజింగ్ ట్రస్టీ అయిన భువనేశ్వరి శుక్రవారం సమీక్షించారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. కరోనా విపత్తులో ఎన్టీఆర్ ట్రస్ట్ పేదలకు అండగా నిలిచిందన్నారు. ఇప్పటి వరకు కరోనా రోగులు 782 మందికి పైగా సేవలు అందించగా 480 మంది కోలుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా విభాగం ఆధ్వర్యంలో అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కరోనా బాధితుల కోసం 24/ 7 కాల్ సెంటర్ ఏర్పాటు చేసి అత్యవసర సమయంలో అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు భువనేశ్వరి చెప్పారు.
Must Read ;- తెలంగాణలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లు : నారా భువనేశ్వరి










