టీమిండియా.. ఆసీస్ పర్యటన అవాంతరాలు, అడ్డంకులు, అవస్థలతో నిండిపోయింది. దీనికి వరుణుడు తోడు కావడంతో అసలు ఏం జరగబోతోందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఒక్క తొలి టెస్టు తప్ప ప్రతీ టెస్టుకు ముందు భారత్ కు ప్రతికూలతలే ఎదురయ్యాయి. అయినా సరే టీమిండియా ఎదురీదుతోంది. కష్టాలన్నీ అధిగమిస్తోంది. మ్యాచ్ మ్యాచ్‌కూ అనుభవజ్ఞులు దూరమవుతున్నా… తనదైన శైలిలో రిజర్వ్ బెంచ్ సత్తా చాటుతోంది. నిజం చెప్పాలంటే టీమిండియాది పోరాటం కాదు… అంతకుమించిన ఉక్కు సంకల్పం!
ఆసీస్ శుభారంభం…
ఆసీస్ కు మూడో సెషన్ లో శుభారంభమే లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 21/0తో నాలుగో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్ ఆశించిన స్థాయిలో ప్రతిభ కనబరిచింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (48), హ్యారిస్ (38) తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. అయితే భారత బౌలర్లు పుంజుకుని వరుస ఓవర్లలో ఓపెనర్లను పెవిలియన్ కు పంపించారు. తర్వాత క్రీజులోకి వచ్చిన లబుషేన్ (25), స్మిత్ వేగంగా పరుగులు సాధిస్తూ తమ ఉద్దేశాన్ని చెప్పారు. కానీ సిరాజ్ ఒకే ఓవర్‌లో లబుషేన్, వేడ్ (0)ను ఔట్ చేసి ఆసీస్‌ను దెబ్బతీశాడు. దీంతో ఆసీస్ ఆత్మరక్షణతో బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
328 పరుగుల లక్ష్యం…