రాజకీయాల్లో ఎదుటివారిని ఒకటి అంటే.. ఆ ఎదుటివారో..ఎదుటివారి సంబంధీకులో, అభిమానులో నాలుగు అనడం కామన్. ప్రస్తుత రాజకీయాల్లో నాలుగు అనడమే కాదు.. వందల్లో అలాంటి కామెంట్లు వస్తాయి. ఇక సోషల్ మీడియాలో అయితే.. వాడుక భాష, వాడకూడని భాష అనే తేడా లేకుండా కామెంట్లు రావడం సాధారణమైంది. తాజాగా గజపతి రాజుల వంశీకుల వారసురాలిగా చెప్పుకుంటున్న సంచైత గజపతిరాజు సోషల్ మీడియాలో చేసిన పోస్టు, ఆ పోస్టుకు వస్తున్న రిప్లైలను పరిశీలిస్తే అర్థం అవుతుంది.
చంద్రబాబుతో పాటు అశోక్ గజపతిని టార్గెట్ చేస్తూ..
అవకాశం దొరికినప్పుడల్లా.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై ఆయన అన్న కుమార్తె మాన్సాస్ చైర్ పర్సన్ గా నియమితురాలైన సంచైత గజపతిరాజు ఓ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు అశోక్ గజపతిని టార్గెట్ చేస్తూ.. ట్వీట్ చేశారు.
‘పార్టీ పెట్టుకుని సొంత కాళ్లమీద అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌ను పదవి నుంచి తప్పించి ఆయన మరణానికి కారకులైన వ్యక్తుల్లో @ncbn గారితో పాటు @Ashok_Gajapathi గారు ఒకరు. వీరిని పార్టీని నుంచి బహిష్కరించాలని ఎన్టీఆర్ ఆరోజు రాసిన లేఖ ఇది. ఆనాటి కుట్రలో ఎవరు ఉన్నారో చెప్పే సాక్ష్యం ఇది’ అంటూ అప్పట్లో రాసిన లేఖగా చెబుతున్న ఫొటోను జత చేశారు. రాజకీయ సూత్రాలను, నైతిక విలువలను, ప్రజలిచ్చిన తీర్పును మంట గలిపిన @Ashok_Gajapathi గారు ఎన్టీఆర్ ఆరాధ్యదైవం అంటూ ఆయన వర్థంతి రోజున కొనియాడటం, ఒక వ్యక్తిని హత్య చేసిన హంతకుడు, అదే వ్యక్తి దూరమయ్యాడంటూ కన్నీరు కార్చినట్టుగా ఉంది అని ట్వీట్ చేశారు.
అంతకు ముందు అశోక్ గజపతి రాజు, ఎన్టీఆర్ వర్దంతిని పురస్కరించుకుని ‘తెలుగు వారి కీర్తిని ఎలుగెత్తి చాటిన ఆంధ్రుల ఆరాధ్య దైవం మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 25 వ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరిస్తూ, ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరం నడుచుకోవాలని మరియు మన పార్టీ పురోభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాను.’అని ట్వీట్ చేశారు. దీనిపై సంచయిత కౌంటర్ ట్వీట్లు చేశారు.
Must Read ;- నేను చెప్పిందే వేదం .. నేను పలికిందే గీతం : దటీజ్ సంచైత
రాజకీయ సూత్రాలను, నైతిక విలువలను, ప్రజలిచ్చిన తీర్పును మంటగలిపిన @Ashok_Gajapathi గారు ఎన్టీఆర్ ఆరాధ్యదైవం అంటూ ఆయన వర్థంతిరోజున కొనియాడ్డం, ఒక వ్యక్తిని హత్యచేసిన హంతకుడు, అదే వ్యక్తి దూరమయ్యాడంటూ కన్నీరు కార్చినట్టుగా ఉంది (2/2)
— Sanchaita Gajapati (@sanagajapati) January 18, 2021

తండ్రి పేరు కూడా చెప్పని మీరా..అంటూ
ఇక్కడివరకు బాగానే ఉన్నా..సోషల్ మీడియాలో వార్ మొదలైంది. సంచయిత గజపతిని టార్గెట్ చేస్తూ.. తండ్రి పేరు కూడా చెప్పని మీరు ఈ ట్వీట్ చేయటం ఏంటని ప్రశ్నించేవారు కొందరు కాగా, జగన్ విసిరేసే వాటి కోసం మీ విలువ దిగజార్చుకోవద్దని కొందరు చెప్పారు. వీటితో పాటు ..అప్పట్లో ఏం జరిగిందో తెలియకుండా..జగన్ విసిరే మెతుకుల కోసం మీ బాబాయికే వెన్నుపోటు పొడిచావంటూ మరికొందరు కామెంట్ చేశారు. మహిళవి కాబట్టి..బూతులు తిట్టడం లేదని, ఇలాంటి చీప్ పాలిటిక్స్ కరెక్ట్ కాదని, టీడీపీ కార్యకర్తల ఇంట్లో పనిచేసేందుకు కూడా పనికిరాని విధంగా స్థాయిని దిగజార్చుకున్నారని, చంద్రబాబుని విమర్శిస్తే పేరు వస్తుందనే ఉద్దేశంతో ఈ రకమైన ట్వీట్ చేశారని కామెంట్లు చేస్తున్నారు. ఇకరాత్రికి రాత్రి బాబాయిని పదవి నుండి తీసేసి గద్దెనెక్కిన మిమ్మల్ని ఏమనాలి? పదవి కోసం తండ్రి పేరు మార్చుకున్న మీరు ఎలా ప్రశ్నిస్తారు..అనే కామెంట్లు వస్తున్నాయి. మరికొందరు మీ తండ్రి గారు బతికున్నప్పుడు, అసలు ఆయన చనిపోవడానికి కారణం ఏంటని, ఆయన కూడా బయటకు చెప్పుకోలేని కారణంతో మానసిక వ్యథకు గురయ్యారని, చనిపోయిన రోజు మీరు ఎక్కడున్నారని, ఆస్తుల కోసం ఇప్పుడు తండ్రి పేరును, గజపతి పేరును వాడుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పబ్బుల్లో తిరిగి, క్రిస్టియన్‌ను తండ్రిగా చెప్పుకునే మీరు మా హిందూ దేవాలయాలలో పదవుల కోసం జగన్ కాళ్ళ మీద పడ్డారని, పరువును, వ్యక్తిత్వాన్ని కోల్పోయారన్న విషయం గ్రహించాలని మరికొందరు సలహా ఇస్తున్నారు. మొత్తం మీద ఇన్నాళ్లు.. స్క్రీన్ వెనుక యాంటీ టీడీపీ అజెండా కనిపించినా.. కేవలం కుటుంబ ఆస్తుల వ్యవహారంగా కనిపించినా.. ఇప్పుడు డైరెక్ట్ పాలిటిక్స్‌లోకి దిగారని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో.. టీడీపీ శ్రేణుల నుంచి కామెంట్లు, కౌంటర్‌గా వైసీపీ శ్రేణుల నుంచి కామెంట్లు కూడా రావడం సహజమే. అయితే ఆ క్రమంలో రాజవంశీకురాలిగా గౌరవప్రదమైన కామెంట్లను ఎదుర్కొంటారా.. లేక ఆ కుటుంబ గౌరవాన్ని, హోదాను తగ్గించే విధమైన కామెంట్లను ఎదుర్కోవాల్సి వస్తుందా అనేది చూడాలి.
Also Read ;- రాజసంపై రాక్షసత్వం.. అశోక్ గజపతి రాజు టార్గెట్











