ఏపీరాజకీయాలు ఎత్తులు,పై ఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలతో రోజుకోరకంగా మారిపోతున్నాయి. క్రూర,కుట్ర పూరిత రాజకీయాలకు
స్వస్తి చెప్పి జగన్‌ను సాగనంపేందుకు సిద్ధమవుతున్నారు ఏపీ ప్రజలు. అందుకు తగ్గట్టే అరాచక పాలనతో అథమ స్థాయికి చేరుకుని వైసీపీ ప్రభుత్వం నట్టేట మునగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మాట సర్వేలు చెబుతున్నదే కాదు, రాజకీయ నిష్ణాతులు సైతం ఇదేమాట చెబుతున్నారు.
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబును జైల్లో పెట్టించి చట్టం తన పని తానుచేసుకుపోతోందంటోన్న సీఎం జగన్ కుట్ర రాజకీయాలను అనుక్షణం గమనిస్తోన్న కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తోంది. చంద్రబాబు అరెస్ట్ అక్రమని, అన్యాయమని ప్రత్యేకంగా టీడీపీ యువ నేత లోకేశ్‌ను పిలిపించుకుని మాట్లాడన కేంద్రం హోం మంత్రి అమిత్ షా ఆ సమయంలో పెట్టిన ప్రతిపాదన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది.
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో తప్పంతా కేంద్రానిదే అన్నట్టు అపవాదులేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తోన్న సీఎం జగన్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు బీజేపీ నేతలు. జగన్ కు దగ్గరవడం వల్ల రోజురోజుకూ పెరిగిపోతున్ననష్టాన్ని అంచనా వేసి లోకేష్ ముందు ఓ ప్రతిపాదన ఉంచారు అమిత్ షా. బీజేపీని కూడా కలుపుకుపోతూ.. కొన్ని సీట్లను ఇవ్వటం ద్వారా అన్నీ సద్దుమణుగుతాయని కేంద్రం ఆలోచన. అలా చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో జగన్‌కు చెక్ పెట్టొచ్చని, బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిస్తే అధికారం చేపట్టడం ఖాయమని అమిత్ షా లోకేశ్‌కు సూచించారు.
ఆ తర్వాత రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అయిన లోకేశ్ అమిత్ షా తనకు చేసిన ప్రతిపాదనను ఆయనకు వివరించారు. అయితే బీజేపీ కోరినన్ని సీట్లను ఇచ్చేందుకు సిద్ధంగా లేని తెలుగుదేశం పార్టీ అధినేత తాను కూడా కొత్త ప్రతిపాదన సూచించినట్టు సమాచారం. కేంద్రం ఆలోచిస్తున్నట్టు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిస్తే జగన్‌ను ఓడించటం కష్టమేమీ కాదని చంద్రబాబు కూడా అభిప్రాయపడ్డారు. అయితే ఇదే అదనుగా తీసుకుని బీజేపీ గొంతెమ్మ కోరికలు కోరటం సరికాదన్నఅభిప్రాయంతోనూ చంద్రబాబుఉన్నారట. అందుకే రెండు రోజుల్లో బెయిల్ పై జైలునుంచి విడుదలయ్యాక ఈ ప్రతిపాదనను మరో సారి సమీక్షిద్దామని చంద్రబాబు లోకేశ్‌కు చెప్పారట











