వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో విరుచుకుపడే టీవీ జర్నలిస్టుగా గుర్తింపు ఉన్న వెంకటక్రిష్ణ అలియాస్ వీకే.. ఛానెల్ మారడానికి తీసుకున్న నిర్ణయం ఆగిపోయింది. మొన్నటిదాకా ఏబీఎన్ టీవీ ఛానెల్ లో డిబేట్ లు నిర్వహిస్తూ.. చెలరేగిన వీకే.. మహా ఛానెల్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఏబీఎన్ కు తిలోదకాలు ఇచ్చారు. మహాతో డీల్ మాట్లాడుకున్నారు. అయితే సదరు కొత్తడీల్ అనుకున్నట్లుగా కుదరలేదు. దీంతో తిరిగి.. ఏబీఎన్ లోనే కొనసాగుతున్నారు. మహా డీల్ వర్కవుట్ కాకపోవడం వల్లనే.. వీకే ఏబీఎన్‌కు పరిమితం అయ్యారని సమాచారం.
ఈటీవీ కంట్రిబ్యూటర్‌గా ప్రస్థానం ప్రారంభించిన వెంకటక్రిష్ణ ఈటీవీ నుంచి ఇతర ఛానెళ్లకు మారుతూ.. టీవీ5, 6 టీవీ, మహా, తదితర ఛానెళ్ల మీదుగా ప్రస్తుతం ఏబీఎన్ వరకు ప్రస్థానం కొనసాగించారు. టీవీ5లో ఉండగా.. రిలయన్స్ కంపెనీల వారే.. వైఎస్ రాజశేఖరరెడ్డిని హత్య చేయించారని అర్థం వచ్చేలా డిబేట్లు నిర్వహించి సంచలనాలకు కారణమయ్యారు. అరెస్టు కూడా కావడంతో.. ఒక్కసారిగా ఆయన పేరు అందరికీ తెలిసింది. అక్కడినుంచి స్టార్ జర్నలిస్టు హోదాను రంగరించుకుని చెలరేగిపోయారు.
24×7 చానెల్ తర్వాత.. వెంకటక్రిష్ణ ఏబీఎన్ కు వచ్చారు. అయితే ఇటీవల ఆ చానెల్ నుంచి బయటకు వచ్చారు. మహా ఛానెల్ బాధ్యతలు తీసుకునేలా వారితో బేరసారాలు సాగాయని సమాచారం. తాను ప్రస్తుతం సెలవులో ఉన్నానంటూ ఆయన స్వయంగా సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. అయితే.. వెంకటక్రిష్ణను ఏబీఎన్ తొలగించిందని.. ఒక నాయకుడి దగ్గరినుంచి 50 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసినందుకు ఇలా తొలగించారని రకరకాల పుకార్లు వచ్చాయి. విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం మేరకు మహా ఛానెల్ తో డీల్ కోసమే వెంకటక్రిష్ణ బయటకు వచ్చారు. అయితే ఆ డీల్ ఆయన అనుకున్నట్టుగా సెట్ కాలేదు. దీంతో తిరిగి ఏబీఎన్ లోనే కొనసాగుతూ డిబేట్లు చేస్తున్నారని సమాచారం.
కోర్టుకు వెళ్లనున్న వెంకటక్రిష్ణ
వెంకటక్రిష్ణ ఛానెల్ మారుతున్నారని, ఏబీఎన్ వీడుతున్నారని వార్తలు వచ్చిన తర్వాత.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. వైఎస్సార్ సీపీ అభిమానులుగా ముద్ర ఉన్న వాళ్లు.. వెంకటక్రిష్ణను ఎద్దేవా చేస్తూ రకరకాల పోస్టులు పెట్టారు. వెంకటక్రిష్ణ ఈ పోస్టులు అన్నింటినీ.. సేకరించి.. వారి మీద కూడా హైకోర్టుకు వెళ్లనున్నట్లుగా సమాచారం. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ఆయన కోర్టులో దావా వేస్తున్నారని సమాచారం.
Journalist Venkata Krishna Remains With ABN :
ఏబీఎన్ ఛానెల్ లో (గ్యాప్ తర్వాత.. డిబేట్ మళ్లీ ప్రారంభించిన తర్వాత) వెంకటక్రిష్ణ.. తాను ఏం చేయబోతున్నారో ఇండికేషన్ ఇచ్చినట్లుగా కొన్ని మాటలు అన్నారు. రఘురామక్రిష్ణ రాజు పై సీబీఐ కేసు నమోదు కావడానికి సంబంధించి.. డిబేట్ నిర్వహించిన ఆయన.. లైవ్ లోకి ఆర్ఆర్ఆర్ రాగానే.. మీ పార్టీ (వైఎస్సార్సీపీ) వాళ్లంతా నేను రానని.. రాలేననుకుని చాలా చేశారని.. వారందరినీ కూడా పూర్తిగా సంతృప్తి పరుస్తానని చెప్పడం గమనార్హం. ఈ మాటల అర్థం.. కోర్టుకు వెళ్లడమేనని కూడా పలువురు విశ్లేషిస్తున్నారు.
Must Read ;- ఏపీ బీజేపీ సారథే ‘జగన్ ’ బ్యాచీ అని చెప్పిన ఏబీఎన్ RK