విస్తరణ ఖాయం .. తేదీ కూడా దాదాపు ఖరారు!
ఏపీలో కేబినేట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. గమర్నర్ షేడ్యూల్ తీసుకుని మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేయాలని జగన్ రెడ్డి భావిస్తున్నారు. వచ్చే డిసెంబర్ మొదటి లేక రెండో వారంలో ఈ కసరత్తు పూర్తి చేసుకుని ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని రోడ్డు మ్యాప్ ను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది అధికారపార్టీ. అయితే మంత్రి వర్గ విస్తరణలో పదవీచ్యుతులయ్యే మంత్రల స్థానంలో పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్న సీనియర్లకు, సామాజీకవర్గాల వారీగా తీసుకోవాలని భావిస్తోంది జగన్ రెడ్డి ప్రభుత్వం. అన్ని సర్వేలు పూర్తి అయిన తరువాతే ఈ దఫా కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీల కసరత్తు పూర్తి చేసిన జగన్ .. ఈ సారి కేబినేట్ లో కొత్త ఎమ్మెల్సీలలో కొంతమందికి అవకాశం కల్పిస్తారని సమాచారం కూడా ఊపందుకుంటుంది. ఆల్మోస్ట్ డిసెంబర్ 5న కేబినేట్ విస్తరణ పూర్తి చేసి సార్వత్రికానికి సిద్ధం కావాలని అధికారపార్టీ వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
బెర్త్ దక్కకుంటే దిక్కారమేనా!
మొదటి కేబినెట్లో పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లకు చోటు దక్కలేదు. కాకుంటే ఈ సారి వారి అవకాశం ఇస్తారనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే మొదటి దఫా కేబినెట్ లో మంత్రుల పదవులు పొందిన వారు కోవిడ్ కారణంగా కేవలం ఆరు మాసాలే ఆ శాఖల్లో విధులు నిర్వర్తించారు. రెండేళ్లుపాటు మంత్రులు కరోనా కట్టడిపైనే పనిచేశారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు సినీయర్లుకు ఈ సారి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే శాఖ పరంగా పట్టుసాదించకుండా పదవీ నుంచి వైదొలగాల్సి వస్తోందని కొంతమంది మంత్రులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా సామాజీక సమీకరణలు, రాజకీయ పరిస్థితుల నేపథ్యాన్ని లెక్కలు వేసుకుని మంత్రి వర్గ కూర్పు ఉండబోతుంది. అయితే ఎంతోకాలంగా మంత్రుల పదవుల కోసం ఎదురుచూస్తున్న సీనియర్లకు ఈ దఫా దక్కకుంటే దిక్కార స్వరం వినిపించేందుకు కూడా వెనకాడనట్లు తెలుస్తోంది. ఈ సారి మంత్రి వర్గం విస్తరణ ఆశావహుల లిస్ట్ చాంతాడంతా ఉంది. వీరిలో సగంమందికి పైగా బెర్త్ కన్ఫాం కాకుంటే అసంతృప్తి జ్వలాలు రేకేత్తక మానవు అన్నట్లు కనిపిస్తోంది. జగన్ మంత్రివర్గ విస్తరణలో తెలుగుదేశం ప్రభావం కూడా కొద్దోగొప్ప లేకపోలేదు. టీడీపీ గ్రామస్థాయి నుంచి నియోజవర్గ స్థాయి వరకు పార్టీని ప్రతిష్టం చేసుకునే దిశగా అడుగులువేస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చిన గ్రౌండ్ ను సిద్ధం చేసుకునే పనిలో తమ్ముళ్లు ఉన్నట్లు సమాచారం.
Must Read ;- ఏపీలో తిరుగుబాటు బావుట!











