లాండ్ మాఫియాలో నూతన అధ్యాయం !
ఏపీలో సహజ వనరుల దోపిడి అడ్డగోలు జరుతుంటే .. లాండ్ అండ్ శాండ్ మాఫియాది ఒక రేంజ్. ఈ మాఫియా అంతా ప్రభుత్వ కనుసన్నల్లో లీగల్ రూపం దాల్చి .. వ్యవస్థలను ధ్వంసం చేస్తోంది. ఈ వ్యవస్థల్లో జరుగుతున్న మాఫియా అసలుసిసలైన మాఫియాకే ఏవగింపు కలిగేలా ఉంటుందని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఏపిలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అధికారపార్టీ చేస్తున్న భూ మాఫియా, కబ్జాలు కోకొల్లలు. ఇదిలా ఉంటే విశాఖ కేంద్రంగా సర్కారు చేతగాని ఆటగా ప్రారంభించిన ల్యాండ్ మాఫియా పెద్ద దుమారాన్నే లేపింది. సీఎం జగన్ రెడ్డి సొంత జిల్లాలో ఎర్రగుంట్ల మండలం కోడూరు గ్రామంలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. యద్ధేచ్ఛగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, అదేమిటని అడిగిన తహశీల్దార్ పై అధికారపార్టీ నాయకులు దాడికి యత్నించారు. దీనిపై విచారణ జరిపితే చంపుతాం అని బెదిరించారంటే వీరి బలుపు, బరితెగింపు ఏపాటిదో అర్థమౌతునే ఉంది. అలానే విశాఖలోని అత్యంత విలువైన 13.59 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మి సొమ్ము చేసుకోవాలని భావించిన జగన్ రెడ్డి వైఖరిని ఉత్తరాంధ్ర ప్రజలు బాగానే ఎండగట్టారు.
ఖాకీ – ఖద్దర్ ఒకటైతే .. బలవన్మరణమే!
ఏపీలోని 13 జిల్లాలో అధికార పార్టీ నేతలు చేస్తున్న లాండ్ మాఫియాకు అడ్డుఅదుపులేకుండా పోతుంది. ఎంతటి బరితెగింపుకాకపోతే .. ఆశ్రమాలు, చర్చిలు, మైనారిటీ ఆస్తులనూ సైతం వదలకుండా కబ్జాకు పాల్పడ్డారు. కబ్జాను ప్రశ్నిస్తే పోలీసులతో బెదింపులకు దిగుతున్నారు. ఖాకీ – ఖద్దర్ ఒకటైతే దిక్కుతోచని స్థితిలో బడుగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో దళిత రైతుల భూములు సుమారు రూ. 200 కోట్లు విలువచేసేవి కబ్జా గురైతే, రక్షించాల్సిన రెవిన్యూ, కబ్జాకోరులను శిక్షించాల్సిన పోలీసులు చేతులెత్తేశారు. ఇలా చేస్తే సామన్యుడు గోడు ఎవరికి విన్నవించుకోవాలి. ఇలా అనంతరపురం, విజయవాడ, గుంటూరు అధికారపార్టీ కబ్జాలకు అవధుల్లేవు. కడప జిల్లాలో అక్బర్ బాషాకు చెందిన భూమిని వైసీపీకి చెందిన ముఖ్య నేత కబ్జాకు పాల్పడితే, స్థానిక ఎమ్మెల్యే, ఎస్పీ న్యాయం చేయకపోగా .. సీఐ కొండారెడ్డి తో చిత్రహింసలు గురిచేశారు. చివరకు రాక్షస రాష్ట్రంలో మైనారిటీల బ్రతుకులు ఇంతేనని కుటుంబ సమేతంగా ఆత్మహత్య పాల్పడిన ఘటనలు కడు దయనీయం. ఇలా వేలాల్లో కబ్జాలకు పాల్పడి .. వందల కోట్ల ఆస్తులను వెనకేసుకుంటున్న లీగల్ మాఫియా ఆగడాలను ప్రజలు గమనిస్తునే ఉన్నారు. అవకాశం ఎదురుచూస్తున్నారు.
ఎవరబ్బా సొమ్ము .. సహజ వనరులు?
ప్రజాధనాన్ని, సహజ వనరులను ఒక పద్దతి, విధానం లేకుండా ఖర్చుచేస్తూ దోచుకోవడం జగన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. సహజ వనరులో ప్రధానమైంది, నిత్యావసరమైంది ఇసుక. ఏపీలో అధికార పార్టీ చేస్తున్న ఇసుక దందా దేశంలో ఎక్కడ చూడలేం. అడ్డగోలు రూల్స్ పెట్టి, వినియోగదారుడికి ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ లో ఇసుక మాఫియా చేస్తున్నారని జేబు పత్రికల్లో తాటికాయాంత అక్షరాలతో వార్తలు రాపించిన జగన్ రెడ్డికి, అదే మాఫియా ద్వారా కోట్లు కొల్లగొట్టవచ్చునని వచ్చిన ఐడియాకు ఎంత తిట్టిన తక్కువేనని బాధిత గృహ నిర్మాణదారుడు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇవి మీకు వినిపించడంలేదా? లేకుంటే దోచుకుని శేషజీవితం జైల్లో గడపాలని తలిచారో కానీ.. మీ ఆగడాలకు మాంచి బుద్ది చెప్పే రోజు ముందుందని మాత్రం గ్రహించాలని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం హయంలో ట్రాక్టర్ ఇసుక ధర రూ.1500 ఉంటే .. లీగల్ మాఫియా దానిని రూ. 7 వేలు చేసింది, అదే లారీ ఇసుక అప్పుట్లో రూ.10 వేలు ఉంటే .. నేడు రూ. 75 వేలు నుంచి లక్ష రూపాయాలకు పైగా వసూళ్లు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఫ్రీగా ఇచ్చే ఇసుక నేడు వాగులు, వంకలు, చెరువులు, నదులను సైతం వదలకుండా లీగల్ మాఫియా తోడేస్తోంది జగన్ రెడ్డికి కనిపించడంలేదా?. ఇసుక మాఫియాను లీగల్ చేయడం ద్వారా మీరు వేల కోట్లు గడించి ఉండవచ్చు .. దానిపై ఆధారపడి జీవించే అనేక రంగాలు ఏ స్థాయిలో కుదేలయ్యాయో ఈ గుడ్డి ప్రభుత్వానికి కనిపించడంలేదా? అని కడుపుకాలుతున్న ఎందరో ప్రశ్నిస్తున్నారు. పంచభూతాలను సైతం మాఫియా చేసే .. పార్ట్ ల కొద్దీ హోల్ సెల్ గా అమ్మే మీకు దాని ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఈ జీవిత కాలం సరిపోదు. రావణుడి చావుకు, నరకాసురుడి వథకు ఎన్నో కారణాలు ఉండచ్చో .. కానీ జగన్ రెడ్డి పతనానికి ఈ ఒక్క ఇసుక మాఫియా చాలు అని యావత్తు దేశం నవ్వుకుంటుంది.











