సహించారు .. భరించారు .. భరోసాకానరాక బావుట ఎగరవేశారు!
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి పాలన పగ్గాలు చేతపట్టిన నాటి నుంచి రాష్ట్రం రివర్స్ లో స్వింగ్ అవుతోంది. ప్రజల భవిష్యత్తు, భావితరం అంధకారంలో నెట్టవేయబడ్డాయి. రివర్స్ పదాన్ని ఆయనకు ఎవరు తగిలించారో కానీ .. జగన్ రెడ్డి రాజకీయ భవిష్యుత్తునే తలకిందులు చేసింది. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రివర్స్ టెండరింగ్ లోకి తీసుకొచ్చి ప్రజాధనం వృధా కాకుండా చూస్తానని నమ్మపలికారు. చివరికి ఖజానాను ఖాళీ చేశారు. పైసా నిల్వలేకుండా ఊడ్చేసి .. ఢిల్లీ టూర్ పేరుతో కేంద్ర మంత్రుల గల్లీలకు ఆర్థిక మంత్రి బుగ్గనను పరిమితం చేశారు. పథకాలు అమలు చేస్తున్నామని కలరింగ్ ఇచ్చి .. నిత్యావసరాలను పెంచేసి కూర్చున్నారు. అసలే కరోనా, అందులో ధరలు పెరిగి సామాన్యుడు అలమటిస్తున్నవేళా .. పెట్రోల్, డిజీల్ ధరలను పెంచుకుంటూ పోయారు. పక్క రాష్ట్రాల్లో అమలు చేస్తున్నా ఆయిల్స్ ధరలను మన రాష్ట్రంలో కూడా కంటిన్యూ చేయాలని గత నాలుగురోజుల నుంచి బీజేపీ, తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు రోడ్డెక్కి నిరసన చేస్తున్నా .. జగన్ కు చీమకుట్టినట్లు కూడా లేదు. మరోపక్క ఎయిడెడ్ విలీనం పై విద్యార్థి సంఘాలు నిరసన బాట పట్టారు. అంధకారంలో నెట్టవేయబడుతున్న ఎయిడెడ్ విద్యను, విద్యార్థులను భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నిరసనలు ఎన్ని చేసిన, ఆందోళనల ద్వారా ఎన్ని హితవులు పలికిన చెవిటివాడి ముందు శంఖరావంగా మారింది ప్రభుత్వ పాలన చూస్తే.
హీటెక్కిన రాజకీయాల్లో సమిధలన్నీ ఒకతాటికి!
రాష్ట్రంలో పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎయిడెడ్ విలీన కుట్రను భగ్నం చేసిన విద్యార్థి సంఘాలపై కక్ష్యపెంచుకున్న జగన్ వారిపై దాడులకు సైతం వెనకడు వేయడంలేదు. అనంతపురం ఎస్ఎస్బీఎన్ కళాశాలలో విద్యార్థులపై జరిపిన పోలీసు చర్యలు అమానుషం. దీనిని యావత్తు తెలుగురాష్ట్రాలలోని విద్యార్థి సంఘాలు ఖండిస్తున్నాయి. అంతేకాక పార్టీలకు అతీతంగా విద్యార్థులకు మద్దతు తెలుపుతూ .. రెడ్డెక్కి నిరసన తెలిపారు. ముక్తకంఠంతో
ఎయిడెడ్ పై జగన్ రెడ్డి నిర్ణయాలను, కుట్రపూరిత ఆలోచనలు ఎండగడుతున్నాయి అఖిలపక్షం. మరోపక్క పొరుగు రాష్ట్రాల్లో పెట్రోల్,డిజీల్ ధరలు తగ్గించి, వాహనదారులకు ఉపశమనం కల్పింస్తే .. మొండి, మొద్దు ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. రోడ్డెక్కి పెట్రోల్ బంకులు ఎదుట నిరసన తెలియజేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత పిలుపునిస్తే .. బీజేపీ, వామపక్షాలు తమదైన శైలిలో నిరసనలు తెలుపుతున్నాయి. అలాగే ఇంకో పక్క రాష్ట్రంలో మిగిలి ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న వేళా .. అధికారపార్టీ చేస్తున్న దౌర్జన్యాలను, ఆరాచకాన్ని, రాజ్యాంగ ఉల్లంఘనలను ప్రజలు గమనిస్తునే ఉన్నారు. ప్రలోభాలు, డబ్బు, మద్యం పంచకుండా నెగ్గలేని అధికారపార్టీ .. ఇంకో నీచపు చర్యకు తెరతీసింది. ఏకగ్రీవాలకు విపక్షం ఒప్పుకోకపోతే ఫోర్జరీ సంతకాలు పెట్టి, నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేస్తున్నారు. ఈ చర్యకు ఆర్వోలు, పోలీసు పూర్తిగా సహకరించడంతో లోకల్ వార్ అధికారపార్టీ వశంలా మారింది. దీనిని ప్రశ్నించిన టీడీపీ, బీజేపీ లను పోలీసులతో దాడులు చేయించి, కేసుల్లో ఇరుకిస్తున్నారు. అసమర్థ చర్యలకు రాష్ట్రం.. రాజకీయంగా, సామాజీకంగా, ఆర్థికంగా, నైతికంగా దెబ్బతిన్నది. ఏపీ కి పట్టిన దరిద్రాన్ని పారదోలడానికి అఖిల పక్షం యజ్ఞానికి పిలుపునిచ్చారు. ముప్పెట దాడితో అధికారపార్టీ చర్యలను ఎదుర్కొనేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఎయిడెడ్ రక్షణకు పార్టీలన్ని ఒకతాటిపైకొచ్చి విద్యార్థులకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నారు. అలానే పెట్రోల్,డిజీల్ ధరలను తగ్గించకుంటే ఉద్యమాన్ని ఎలా రుచి చూపించాలో కూడా పధక రచన చేస్తోంది.











