జీతాలు ఆపడంపై తలెత్తుతున్న అనుమానాలు..
ఇంధన శాఖలో ట్రాన్స్ కో, డిస్కమ్ ల ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇచ్చి.. జెన్కో ఉద్యోగులకు ఆపడంపై ఎన్నో ప్రశ్నలను, మరెన్నో అనుమానాలను తలెత్తుతున్నాయి. జగన్ రెడ్డి పాలనలో ఏపీ జెన్కో కనుమరుగయ్యే ప్రమాదం ఏర్ఫడింది. ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహింస్తోంది. ఇంధన సంస్థల్లోని ఇతర కంపెనీలకు ఒకలా.. జెన్కోను మరోలా చూడడం ఏమిటంటూ నిలదీస్తున్నాయి. జీతాలు, సమస్యల విషయాన్ని జెన్కో యాజమాన్యం, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు.
ప్రైవేటీకరణవైపు అడుగులు..
జెన్కో ను ప్రైవేటీకరించేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంధన శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందుకే ముందస్తుగా ఉద్యోగుల్లో అశాంతిని రేకిత్తించేలా చర్యలు చేపడుతోందని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ క్రమంలో అదే అదునుగా డిస్కమ్ ల నుంచి రావాల్సిన బకాయిలను జెన్కోకు చెల్లించడం లేదని ఉద్యోగుల సంఘాలు ఆందోళన బాటపట్టాయి. నెల్లూరు శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ ( ఎస్ఎస్డీటీపీఎస్ ) 1600 మోగావాట్ల సామార్థ్యం కలిగి స్టేజ్ -1 లోని ప్లాంట్లను 25 ఏళ్లు పాటు ప్రైవేటు సంస్థలకు లీజుకు అప్పగించాలంటూ గత నెల 21వ తేదీన రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జెన్కో విద్యుత్తు ప్లాంట్లలో నిరసన కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. కావాలనే తమకు జీతాలు, పింఛన్లు ఆపారని జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు నిరసనలు మరింత పెంచారు.
Must Read:-అమ్మా.. భారతమ్మా.. జగన్ గారిని ఎక్కడైన మంచి ఆసుపత్రిలో చూపించమ్మా! – అయ్యన్న