నెల్లూరు ఓ ఎంపీడీవో లొల్లి .. బెంబేలెత్తున్న సచివాలయం సిబ్బంది!
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల ఎంపీడీవో సుస్మిత రెడ్డి లొల్లి, వివాదస్పద వ్యాఖ్యాలు ఈ మధ్య సోషల్ మీడియాలో బ్యూరోక్రాట్స్ వ్యవస్థనే అన్- పాపులర్ చేస్తున్నాయి. పిచ్చి పరాకాష్టకు చేరినట్లు ఈమె ఇచ్చే స్టేట్మెంట్స్ వైసీపీ కార్యకర్తకన్నా దారుణంగా మారాయి. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించడం, పనికట్టుకుని మరి గత ప్రభుత్వాలను విమర్శించడం పరిపాటిగా మారింది. ఈమె కర్తవ్యాలను, విధులను మరిచి.. రాజకీయాలు మాట్లాడడం పెద్ద చర్చకు దారితీస్తోంది. ఓటిఎస్ లబ్ధిచేకూర్చే పథకమే అయితే అసలు ప్రజలేందుకు నిరాకరిస్తారు? విపక్షాలెందుకు ఆక్షేపిస్తాయి? అన్న సృహ కూడా లేకుండా మర్రిపాడు ఎంపీడీవో సుస్మిత కింది స్థాయి అధికారును, సచివాలయం సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. ఆ మధ్య ఓ సచివాలయం సిబ్బందితో ఓటీఎస్ తప్పనిసరిగి లబ్ధిదారుడిపై ఒత్తిడి తీసుకొచ్చి వసూల్ చేయాలని హుకూం జారిచేశారు. అమ్మగారి నిర్వాకం సోషల్ మీడియాలో తెగ వైరలైంది. గురవారం పొదుపు మహిళలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో గత ప్రభుత్వాలంటూ .. ఎత్తుకుని వైసీపీ కార్యకర్త వలే ప్రత్యక్ష విమర్శలకు దిగింది. ఉచిత పట్టాలు, రుణమాఫీలు అంటూ అధికారపార్టీ పాలసీలను వల్లెవేశారు. సాక్ష్యత్తు ఆర్డీవో ముందే ఈ స్థాయిలో రాజకీయాలు మాట్లాడుతుంటే సుస్మిత గట్స్ ఏమిటో వేరే చెప్పనక్కర్లేదు.
ప్రజలు బుద్ధిలేని వారు – ఎంపీడీవో సుస్మితారెడ్డి
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ప్రజలకు బుద్ధిలేదని, ఆమె పెద్ద మే(థా)ధావి అని ప్రకటించుకున్నారు సుస్మిత. ఓటీఎస్ పై ప్రతిపక్షాలు చేసే ప్రచారాన్ని నమ్మకండి .. మీరు బుద్దిని ఉపయోగించండి అంటూ హితవు పలికేందుకు కలరింగ్ ఇచ్చారు. చివరికీ ప్రజలను బుద్ధిలేని వారిని అనేసింది. అంతగా ఓటీఎస్ విషయంలో రియాక్ట్ అవ్వాల్సిన అవసమేమిటి? అని ఇది విన్న ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మా సొమ్ముతో జీతాలు తీసుకుంటూ .. మాకు సర్వేంట్ గా పనిచేయాల్సింది పొనిచ్చి.. రాజకీయాలు మాట్లాడుతావా? అంటూ ఓ రేంజ్ లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకే బుద్ధిలేదు అంటూ విమర్శించడం ఏమిటని మర్రిపాడు ప్రజలు నిలదీస్తున్నారు. ప్రజలపై నిజంగా ప్రేముంటే ఎంపీడీవో నే మా గృహ రుణాలను ఓటీఎస్ లో సెటిల్ చేయాలని కాస్త వ్యగ్యంగా విమర్శలను ఎక్కుపెడుతున్నారు.
Must Read ;- ఏపీలో విధ్వంసకర రాజకీయాలకు కారకుడు ప్రశాంత్ కిషోర్& సో క్లియర్











