రూ. 4 లక్షల కోట్లు అప్పులు..
జగన్ రెడ్డి పాలనలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న అప్పులు రూ. 4 లక్షల కోట్లు అన్నది ఆర్థిక నిపుణుల అంచనాలు. ప్రతినెల వేల కోట్లు అప్పులు చేయందే ఏపీలో పాలన ముందకు సాగలేని వైనం. ప్రభుత్వం చేస్తున్న అప్పులకు, పెడుతున్న ఖర్చుకు సంబంధించిన లెక్కలకు పొంతనలేనివిగా ఉన్నాయని కాగ్ ఎప్పుడో తేల్చి చెప్పింది. వీటికి తోడు బహిరంగ మార్కెట్లో వేల కోట్ల అప్పలు చేస్తోంది! మరోవైపు కార్పోరేషన్ పేరిట వేల కోట్లు రుణాలు తీసుకుంది. ఇలా రాష్ట్రంలోని అన్ని కార్పోరేషన్లను ప్రభుత్వం ఎప్పుడో వాడేసింది. ప్రతి నెల ఐదు వేల కోట్లు అప్పు పుట్టనిదే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, సామాజీక పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి! ఇదిలా ఉంటే మార్చినాటికి మరో 27 వేల కోట్లు అప్పులు చేసేందుకు అనుమతి కావలని కేంద్రాన్ని కోరినట్లు రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదురి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
అప్పుల కోసమేనా ఢిల్లీ పర్యటనా?
జగన్ రెడ్డి పోయిన ఏడాది డిసెంబర్ లో ఢిల్లీలో పర్యటించినప్పుడు 2021-22 సంవత్సరానికి గాను రూ. 27, 325.78 కోట్లు అప్పులు బహిరంగ మార్కెట్లో చేసేందుకు రాజ్యాంగంలోని 293(3) నిబంధన కింద అనుమతి ఇవ్వాలని కోరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. బహిరంగ మార్కెట్లో అప్పులు చేసేందుకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్న పరిమితిని రూ. 42, 472 కోట్లకు పెంచాలని జగన్ కోరినట్లు ఆర్థిక శాఖ ఈ సందర్భంగా వెల్లడించింది!
Must Read:-సీఎం జగన్ ఢిల్లీ పర్యటన అందుకేనా..?