భూకబ్జా ఆరోపణల విషయంలో ఈటల రాజేందర్ ను వైద్యశాఖతో పాటు కేబినెట్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే వార్తలు వినవస్తున్నాయి. భవిష్యత్తు కార్యచరణ కోసం నేడు హుజూరాబాద్‌లో కార్యకర్తలతో మరోసారి మాజీ మంత్రి ఈటల రాజేందర్ భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలతో ఈటల చర్చించనున్నారు. అనంతరం ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేసే అవకాశం ఉంది. ఈటల ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్పై పోరుకు ఈటల రాజేందర్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అరెస్టులు, కేసులకు భయపడేది లేదని ఈటల ప్రభుత్వంపై అమీతుమీకి సిద్ధమవుతున్నారు.
జగన్ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..
YSRCP చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత మేనత్త...











