ప్రస్తుతం టాలీవుడ్ లో అందరి దృష్టి మహేశ్ 28 మీదే ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను విడుదల చేస్తున్నట్టు ఆల్రెడీ నిర్మాతలు ప్రకటించారు. ఇందులో మహేశ్ బాబు జేమ్స్ బాండ్ తరహా పాత్రను పోషిస్తున్నట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీలో మహేశ్ సరసన ఓ బాలీవుడ్ బ్యూటీ నటిస్తోందంటూ ఒక అప్టేట్ వచ్చింది.
పూరీ జగన్నాథ్ , వరుణ్ తేజ కలయికలో వచ్చిన ‘లోఫర్’ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ..ఈ మూవీతో ఒక టాల్ బ్యూటీ టాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ అయింది. ఆమె పేరు దిశా పటానీ. ఇప్పుడామె బాలీవుడ్ లో చాలా బిజీ హీరోయిన్ . అలాగే.. అందాలు ఆరబోయడంలోనూ ఆమె ఆరితేరిపోయింది. అలాంటి ఈ సుందరిని మహేశ్ బాబు జోడీగా సంప్రదించాడట త్రివిక్రమ్. రాధేలో సీటీమార్ సాంగ్ లో నర్తించిన దిశాపటానీ.. ఇప్పుడు చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో కథానాయికగా నటించనుండడం విశేషాన్ని సంతరించుకుంది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై .. చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమా కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రత తగ్గిన తర్వాత సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. ‘అతడు, ఖలేజా’ చిత్రాల తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకు వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. అతడులో మహేశ్ ను పక్కా సీరియస్ పాత్రలో ప్రజెంట్ చేసిన త్రివిక్రమ్.. ఖలేజాలో పూర్తి స్థాయి కామెడీ పాత్రతో ఎలివేట్ చేశాడు. మరి ఈ సినిమాలో మహేశ్ బాబును ఏ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.











