వాట్సప్.. గత కొన్ని రోజులుగా అందరూ దీని గురించే చర్చ. వాట్సప్‌కు సంబంధించిన సమాచార గోప్యత గురించిన మార్పులు ఏకపక్షంగా ఉండడంపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు. కోర్టులను సైతం ఆశ్రయిస్తున్నారు. మరి కొందరు ఈ సమస్యలన్నీ పక్రన పెట్టి వాట్సప్‌కు స్వస్తి పలికేస్తున్నారు. దీనిపై కేంద్రం కూడా జోక్యం చేసుకుని వాట్సప్‌కు కాస్త ఘాటుగానే లేఖ రాసింది. వాట్సప్‌లో జరిగిన మార్పలపై ప్రజలకు కూడా నిర్ణయాధికారం ఉండేలా అవకాశం కల్పించాలని కోరింది లేదా మార్పులను ఉపసంహరించుకోవాలని లేఖ రాసింది.
గోప్యతలో మార్పులు ఏకపక్షం..
వాట్సప్ సిఈఓ విల్ కాథ్‌కార్ట్‌కు కేంద్ర ఎలక్ట్రానిక్స్-ఐ.టి. మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఘాటుగా లేఖ రాసింది. ‘భారత్‌లో 40 కోట్ల మంది వినియోగదారులకు జవాబుదారీ తనం పాటించాల్సిన అవసరం మీకుందని మరచిపోకండి. మీ సేవలకు అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారతీయ ప్రజల సేవలు, గోప్యతపరంగా మీరు ప్రతిపాదించిన మార్పులను అనుమతించడంతోపాటు.. నిరాకరించే అవకాశాన్ని కూడా వాళ్లకి కల్పించాలి. కానీ మీరు కొత్తగా ప్రతిపాదించిన పాలసీలో తిరస్కరించే అవకాశాన్ని ఇవ్వకపోవడం అందరిలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న విషయం. వినియోగదారులు, వారి ఇష్ట ప్రకారం అనుమతి, తిరస్కరణ చేసే అవకాశం కల్పించాలి లేదా మీరు ప్రతిపాదించిన మార్పులను ఉపసంహరించుకోండి.
Must Read ;- గుడ్ న్యూస్! వాట్సప్ అప్డేట్ చేయాల్సిన పనిలేదంట!

భారతీయ వినియోగదారులు, ఇతర దేశాలతో పోలిస్తే గోప్యత విధానాల్లో ఇక్కడ ఎలాంటి తేడా ఉంది అనేవి కూడా తెలపాలని కేంద్రం లేఖలో పేర్కొంది. గోప్యత, సమాచార భద్రతల గురించిన వివరాలు తెలపాల్సిందిగా కేంద్రం కోరింది. ఇతర యాప్‌లతో వినియోగదారులు సమాచారాన్ని పంచుకుంటుంటే అవీ తమ ముందుంచాలని లేఖలో తెలిపింది. ఐరోపా దేశాలకు మార్పులు వర్తింపజేయకుండా భారతీయ వినియోగదారులకే దానిని పరిమితం చేయడంపై అభ్యంతరం తెలిపింది. ఇటువంటి అసమానతలు పాటించడంపై మీ ఉద్ధేశం తెలపాలని కోరింది. ఐరోపా దేశాలలోని వినియోగదారులకు, భారతీయ వినియోగదారులకు పాటిస్తున్న తేడాలపై వివరణ ఇవ్వాల్సింది తెలియజేసింది.
వాట్సప్‌ను తొలగించుకోండి..
తాజాగా ప్రవేశపెట్టన వాట్సప్ మార్పులపై ఢిల్లీ హై-కోర్టులో కొందరు పిటిషన్ దాఖలు చేయగా.. దీన్ని విచారణ చేసిన సంజీవ్ సచ్దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాట్సప్ అనేది ఒక ప్రవేటు సంస్థ. వాళ్లు ప్రవేశపెట్టిన ప్రతిపాదనలు మీకు ఇబ్బంది కలిగిస్తుంటే మీ ఫోన్ నుండి వాట్సప్‌ను తొలగించుకోండి అంటూ వ్యాఖ్యనించడం సర్వత్రా చర్చానీయాంసమైంది.
Also Read ;- వాట్సప్ కొత్త పాలసీ ఏంటి? మన డేటా భద్రమేనా?











