చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలం చింతమాకుల పల్లి గ్రామానికి చెందిన ఢిల్లీ బాబు, ప్రేమించిన గాయత్రిని హత్య చేసి అడవిలోకి పారిపోయాడు. హత్య అనంతరం నిందితుడి ఢిల్లీ బాబు ఇంటికి నిప్పు పెట్టారు గాయత్రి బంధువులు. హత్యకు పాల్పడిన బాబును పట్టుకోవడానికి పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. తూర్పమండలం అటవీ ప్రాంతంలో ఉరి వేసుకుని ఆత్మహ్యత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
వివరాల్లోకి వెళ్తే.. పూతలపట్టు మండలం చింతమాకుల పల్లి గ్రామానికి చెందిన ఢిల్లీ బాబు (19), గాయత్రి (18)ల మధ్య రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రెండు నెలల కొందట ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకున్నారు. గాయత్రి మైనారిటీ ఇంకా తీరకపోవడంతో.. గాయత్రి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆ ఇద్దరినీ స్టేషన్‌కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి వారి వారి ఇళ్లకు పంపారు. ఆపై తనను దూరంగా పెట్టడంతో కోపంతో రగిలిపోయిన ఢిల్లీ బాబు, రోడ్డుపై కత్తితో విచక్షణారహితంగా గాయత్రిపై దాడి చేశాడు. తీవ్ర రక్త స్రావంతో గాయత్రి అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత అడవిలోకి పారిపోయిన ఢిల్లీబాబు.. ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది.
Must Read ;- పోలీసుల ఎదుటే యువతిపై దాడి చేసిన ప్రియుడు