విగ్రహాల ద్వంసం అంశానికి సంబంధించి ఓ పాత వీడియో ఆధారంగా ప్రవీణ్ చక్రవర్తి అనే పాస్టర్ ని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యానించడం, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం లాంటి చర్యలు సర్వత్రా ఖండించదగినవే. అయితే ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ద్వంసం జరుగుతుండడంపై పెద్దయెత్తున నిరసనలు వ్యక్తం కావడంతో.. ప్రభుత్వం, పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ తీసుకున్నారని చర్చ జరుగుతుండగా.. ప్రభుత్వాల నిర్లక్ష్యం కచ్చితంగా ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.
ఏడాది క్రితమే…కేంద్రానికి ఫిర్యాదు
వాస్తవానికి ప్రవీణ్ 2019 డిసెంబరులోనే ఓ వీడియో స్టేట్ మెంట్ ఇచ్చారు. అందులో హిందూ విగ్రహాల ధ్వంసం, మత మార్పిడి, క్రీస్తు గ్రామాలుగా నెలకొల్పడం పై మాట్లాడారు. దీనిపై అదే ఏడాది డిసెంబరు 23 స్వరాజ్ మార్గ్ . కామ్ అనే వెబ్ సైట్ ఈ కథనాన్ని ప్రచురిచింది. ఇదే అంశంపై లీగల్ రైట్స్ ఫోరం అనే సంస్థ స్పందించింది. ప్రవీణ్ చెప్పిన అంశాల ఆధారంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శికి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే విదేశీ విరాళాల నియంత్రణ విభాగం (FCRA) నిధుల నియంత్రణ విభాగానికి ఫిర్యాదుకూడా చేసింది. ఈ వీడియోలో ఆలయాల్లో విగ్రహాలను తొలగించినందుకు అవతలి వ్యక్తి మెచ్చకుంటున్నట్లు, వెంటనే నిధులు ఇస్తామని హామీ ఇచ్చినట్టు కూడా ఉంది. అయితే అప్పటినుంచి అటు కేంద్రంనుంచి ఎలాంటి స్పందనా రాలేదనే చర్చ ఇప్పుడు మొదలైంది. తామే హిందూత్వమే అజెండాగా ప్రచారం చేసుకుంటున్న బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. అయినా.. ఏడాదిపాటు ఈ అంశంపై కేంద్రం మౌనంగా ఎందుకుందనేది చర్చనీయాంశంగా మారింది.
Must Read ;- రామతీర్థం రామునికోసం పూసపాటి అశోక్ వితరణ!
అయితే ఫిర్యాదు వచ్చినంతమాత్రన చర్యలు తీసుకోవాలా అనే అంశానికి వస్తే.. అసలు ఆ వీడియోలో వాస్తవం ఉందా లేదా, ఈ నిధులు ఎక్కడినుంచి వస్తున్నాయి.. ఏ పేరుతో వస్తున్నాయి అనేది తేల్చాల్సిన బాధ్యత కేంద్రానిదే. అయినా ఈ ఫిర్యాదుపై పట్టనట్టు వ్యవహరించడం, రాజకీయ కారణాలు ఉన్నప్పుడే హిందూత్వ అజెండాను బయటకు తీసుకురావడంపై చర్చ జరుగుతోంది. కాగా ప్రవీణ్ చక్రవర్తి పాస్టర్ గా ఉంటూనే.. క్రైస్తవ విద్యాసంస్థలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. మథర్ ధెర్సిస్సా స్కూల్స్, కేటీసీ చిల్డ్రన్ హోం, PVRM ఎడ్యూకేషనల్ సొసైటీ, సైలోమ్ బ్లైండ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి వచ్చే నిధులపై కనీస సమాచారం ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక పాస్టర్ ప్రవీణ్ విషయానికి వస్తే.. ఆయనపై గతంలో పలు కేసులు ఉన్నాయి. పెళ్ళి పేరుతో నమ్మించి యువతిని మోసం చేశారని కాకినాడ టూటౌన్ , సర్పవరం స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కాకినాడ కేంద్రంగా పనిచేసే ప్రవీణ్ మతాలను కించపరిచే పోస్టులు పెట్టటంతో సీఐడీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. తాజాగా ప్రవీణ్ చెప్పిన వీడియోలో.. పలు విషయాలను ప్రవీణ్ చెప్పారు. తమ సంఘంలో మొత్తం 3,642 మంది పాస్టర్లు ఉన్నారని, ఇప్పటి వరకు 699 క్రీస్తు గ్రామాలను నెలకొల్పామని చెప్పాడు. క్రీస్తు గ్రామాలు నెలకొల్పడమంటే.. ఆ గ్రామాల్లో ఉన్న హిందూ దేవతామూర్తుల విగ్రహాలను పగులగొట్టడం, కాలితో విగ్రహాలను తన్నడం లాంటి చర్యలుగా చెప్పాడు. మరో నెలలో 7 వందల గ్రామాలు పూర్తి చేస్తామని అమెరికాలోని దాతకు ప్రవీణ్ వివరించడం సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో ప్రవీణ్ పై 153ఎ,153బీ,505,295ఎ 115ఐపీసీ రెడ్ విత్ 66 ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
విస్తరించారా..
అప్పట్లో చెప్పిన వీడియో లో తమకు వేల సంఖ్యలో ఫాస్టర్లు ఉన్నారని చెప్పడం, అవతలి వ్యక్తి ఆ అంశాన్ని ప్రోత్సహించి నిధులు ఇస్తానని చెప్పిన నేపథ్యంలో.. ప్రవీణ్ చక్రవర్తి ఈ కార్యకలాపాలను ఇతర ప్రాంతాలకు విస్తరించారా..ఇటీవల జరిగిన ఘటనలకు, ప్రవీణ్ అండ్ కో కు సంబంధం ఉందా అనేది ఇంకా తేలాల్సి ఉంది.
Also Read ;- చినజీయర్ యాత్ర.. వైసీపీకి పెద్ద టెన్షన్