వాట్సప్ ఫేస్ బుక్ సొంతమైంది. ఈ నేపథ్యంలో వాట్సప్ సరికొత్త పాలసీనీ తీసుకొచ్చింది. ఈ పాలసీ ద్వారా మన వాట్సప్ సమాచారం ఫేస్ బుక్‌కి లింక్ అవ్వబోతుంది. ఇదే చాలామందిలో అనుమానాలు రేకెత్తిస్తుంది. ఇకపై వాట్సప్ చాటింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్‌కి భద్రత ఉంటుందా అని ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. అసలు వాట్సప్ నుండి ఫేస్ బుక్ ఏ సమాచారాన్ని తీసుకోబోతుంది. దీని మన భద్రతకు భంగం వాటిల్లుతుందా. వాట్సప్ పర్సనల్.. ఫేస్ బుక్ సోషియల్.. ఈ రెండింటి కలయిక వల్ల మన సమాచారం బహిర్గతమవుతుందేమోనని చాలామంది అనుమానాలు. అసలు వాట్సప్ పాలసీ ఏంటో తెలుసుకుందాం రండి.
వ్యక్తిగత సమాచారం భద్రత మాటేమిటి?
వ్యక్తిగత సమాచారం భద్రత విషయంలో ఎటువంటి సమస్య తలెత్తే ప్రసక్తే లేదని వాట్సప్ స్పష్టం చేసింది. ఎన్క్రిప్షన్ కొనసాగుతుందని.. పంపిన వారు.. అందుకున్న వారు తప్ప వేరే వారు చూసే అవకాశాలు లేవని వాట్సప్ అందరికీ మరొకసారి తెలియజేసింది.
Must Read ;- ఒప్పుకుంటారా లేదా తీసేస్తారా వాట్సప్ అల్టిమేటం!
వాట్సప్‌లోని సమాచారం ఫేస్ బుక్‌కి అందుతుందా?
లేదు. వ్యక్తిగత సమాచారం విషయంలో వాట్సప్ పాలసీలో ఏ మార్పులు జరగలేదు.
ఏ సమాచారం ఫేస్ బుక్‌కి అందుతుంది?
యూజర్ వాట్సప్ రిజిస్టర్ చేసుకునే సమయంలో అందించే సమాచారం ఫేస్ బుక్ తో లింక్ కానుంది.. అంటే మీ పేరు, ఫోన్ నంబర్.. మిగిలిన రిజిష్టర్ సమాచారం. వీటితో పాటు వాట్సప్ ద్వారా జరిగే లావాదేవీల సమాచారం అందుతుంది, ఐపి అడ్రస్, బిజినెస్ సమాచారం వంటివి ఫేస్ బుక్ తో లింక్ అవుతాయి. అంతేకాదు.. ఈ సమాచారాన్ని యాడ్స్‌కు ఉపయోగిస్తారని భయపడాల్సిన పని లేదని కూడా సంస్ధ తెలియజేసింది.
Must Read ;- నైజీరియన్ల ఘరానా ఆన్ లైన్ మోసం..