ఆరుగాలం కష్టపడి శ్రమిస్తున్న రైతులకు ఎప్పుడూ నష్టాలే. వరి నాట్లు వేసిన నాటి నుంచి ధాన్యాన్ని మార్కెట్ కు తరలించే వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. ముఖ్యంగా పండించిన పంట కళ్లముందే వర్షంపాలయితే.. ఆ ఘోస మాటల్లో చెప్పలేనిది. టెక్నాలజీ పరుగులు పెడుతున్నా..ఇప్పటికీ వరిధాన్యం ఎక్కడ దాచుకోవాలో తెలియని దిక్కు తోచని స్థితిలో రైతులు ఉన్నారు. ఇవన్నీ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కదిలించాయి. రైతులకు కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకొని ఓ సరికొత్త ఐడియాను ఆవిష్కరించారు. కేవలం రూ.500 లతో 100 క్వింటాళ్ల ధాన్యాన్ని కాపాడుకునే పద్ధతిని రైతులకు వివరించారు.
ఇలా కాపాడుకోవచ్చు
ఒక టార్పాలిన్ కవర్ ను కింద పరిచి, దానిపై ధాన్యం బస్తాలను పిరమిడ్ ఆకారంలో పేర్చాలి. ధాన్యం బస్తాల చుట్టూ మళ్లీ టార్పాలిన్ తో పైకి, కిందకు, చుట్టూవైపులా ఫోల్డ్ చేయాలి. మార్కెటింగ్ ఒక ప్రత్యేకమైన ప్యాకింగ్ మెటిరీయల్ దొరుకుతుంది. కేవలం రూ.500లతో ధాన్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ పద్ధతిలో కనీసం రెండు, మూడు నెలల వరకు ధాన్యం నిల్వలు సేఫ్ గా ఉంటాయి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి రూపొందించిన ఐడియా.. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Must Read ;- ఈటల-కొండా భేటీ.. కేసీఆర్ వ్యతిరేక శక్తుల ఏకీకరణే ప్రధాన అజెండా











