కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అధికార పార్టీ టీఆర్ఎస్ పై విరుచుకుపడుతుండటం, టీఆర్ఎస్ లోని కొంతమంది ఎమ్మెల్యేలు ఈటలతో టచ్ ఉండటం, ఇతర పార్టీల నాయకులు మద్దతు ఇస్తుండటంతో తెలంగాణలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. తాజాగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈటలను కలుసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గురువారం రాత్రి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈటల రాజేందర్ దంపతులను కలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈటల రాజేందర్ వెంటే తెలంగాణ ఉంటది అని అన్నారు. రాజేందర్ తనకు మిత్రుడని, ఎప్పట్నుంచో పరిచయం ఉందని, అందుకే సానుభూతిని తెలపడానికి ఈటలను కలిశానని తెలిపారు. కొండా ఈటలను కలుసుకోవడంతో, వారిద్దరి నుంచి ఏదైనా కొత్త పార్టీ వెలువడే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.
జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!
మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...










