పట్టణ ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టినా,గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వేగంగా పెరుగుతూ ఉండటంతో భారత వైద్య పరిశోధనా మండలి కీలక నిర్ణయం తీసుకుంది.కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ఇంటి వద్దనే వారికి పరీక్షలు చేయాలని సూచించింది.ఒక వేళ కరోనా లక్షణాలు ఉన్నవారికి పాజిటివ్ తేలితే,వారి కుంటుంబ సభ్యులు,సన్నిహితంగా మెలిగిన వారికి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు నిర్వహించాలని ఐసీఎంఆర్ సూచించింది.అయితే విచక్షణా రహితంగా పరీక్షలు నిర్వహించవద్దని రాష్ట్రాలకు సూచించింది.కరోనా పరీక్షల అనంతరం రోగికి ఫలితాలు కూడా అందించాల్సి ఉంది.
మరోసారి పరీక్షలు వద్దు..
ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుల్లో ఒకసారి కోవిడ్ పాజిటివ్ నిర్థరణ అయితే ఇక ఇతర పరీక్షలు అవసరం లేదని కూడా ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.ఇలా టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వారిని నూరు శాతం ఐసోలేషన్లో ఉంచాలన్న కేంద్ర మార్గదర్శకాలు పాటించాలని ఐసీఎంఆర్ గుర్తు చేసింది.ఇక తక్కువ వైరల్ లోడ్ ఉన్న వారికి ర్యాట్ పరీక్షల్లో నెగటివ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించాలని తెలిపింది.
Must Read ;- కోవిడ్ కి నెగిటివ్.. కోవాగ్జిన్ కు పాజిటివ్










