నితిన్ కు ఇప్పుడు హిట్ చాలా అవసరం. ఎంతో ఆశలు పెట్టుకున్న రంగ్ దే, చెక్ సినిమాలు నిరాశ పరిచాయి. బాలీవుడ్ చిత్రం అంధాధున్ ఆధారంగా ‘మ్యాస్ట్రో’ రూపొందుతోంది. ఇప్పటికే రెండు సినిమాల మైనస్ లో ఉన్న నితిన్ కు ఈ సినిమా ఓ ప్రయోగం అనే చెప్పాలి. పైగా అంధాధున్ చిత్రంలో మాస్ ఎలిమెంట్స్ ఉండవు. ఓ హత్య కోణంలో ముందుకు సాగే కథ ఇది. అందులో ఇరుక్కున్న హీరో ఎలా బయటపడ్డాడన్న అంశం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.
తెలుగు నేటివిటీకి తగ్గట్టుగానూ, ఆ హత్యకు సంబంధించిన పరిశోధన నేపథ్యంలో ఈ కథ ముందుకు సాగితే తప్ప ప్రేక్షకుల మన్ననలను చూరగొనడం కష్టం. అందుకు తగ్గ మార్పులు దర్శకుడు చేస్తే ఈ మ్యాస్ట్రో మంచి మార్కులు కొట్టేస్తుంది. శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తున్నఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ కామెడీ తరహాలో సాగే ఈ చిత్రంలో నితిన్ సరసన నభా నటేష్ నటిస్తుండగా, మరో హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది.
ప్రస్తుతం ‘మ్యాస్ట్రో’ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. హిందీలో టబు నటించిన పాత్రను ఇందులో తమన్నా పోషిస్తోంది. ఇది నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర. సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ ఈ రోజు హైదరాబాద్‌లో మొదలైంది. హీరో నితిన్, తమన్నాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ. ఈ షెడ్యూల్ చిత్రీకరణతో ‘మ్యాస్ట్రో’ సినిమా షూటింగ్ పూర్తవుతుంది.
కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్‌లో పాల్గొంటున్న హీరో నితిన్, అలాగే కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత చిత్రీకరణను మొదలుపెట్టిన బిగ్ మూవీ కూడా ‘మ్యాస్ట్రో’నే కావడం విశేషం. ఇప్పటికే నితిన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ‘మ్యాస్ట్రో’ ఫస్ట్‌లుక్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇంతకుముందు నితిన్ హిట్ మూవీ ‘భీష్మ’కు మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వరసాగరే దీనికి కూడా సంగీతం సమకూరుస్తున్నారు.
Must Read ;- నితిన్- వక్కంతం సినిమాకి కొబ్బరికాయ కొట్టేది అప్పుడేనట!











