నితిన్ ప్రస్తుతం ‘అంధాధున్’ బాలీవుడ్ మూవీ రీమేక్ వెర్షన్ ‘మాస్ట్రో’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అలాగే ‘పవర్ పేట’ అనే భారీ ప్రాజెక్ట్ లో కూడా త్వరలోనే నటించబోతున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందనుందని వినికిడి. ఇక దీని తర్వాత రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త గత కొద్ది రోజులుగా వినిపిస్తోంది.
బన్నీతో ‘నా పేరు సూర్య’ అనే మూవీని తన డెబ్యూ గా తెరకెక్కించిన వంశీ తొలి ప్రయత్నంలో సక్సెస్ సాధించలేకపోయాడు. అయినా సరే మరో మంచి కథతో మళ్ళీ బన్నీని మెప్పించాలని ప్రయత్నించాడు కానీ.. ప్రస్తుతం పరిస్థితుల్లో బన్నీ అపాయింట్ మెంట్ కష్టంగా మారడంతో .. యంగ్ హీరో నితిన్ తో సినిమా తీయబోతున్నాడని టాక్. రీసెంట్ గా నితిన్ కు ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ వినిపించాడట. దాంతో బాగా ఇంప్రెస్ అయిన నితిన్.. త్వరలోనే వక్కంతం ప్రాజెక్ట్ కు షిఫ్ట్ అవుతాడట. ఇక ఇందులో నితిన్ సరసన రౌడీ బేబీ సాయిపల్లవి కథానాయికగా నటించబోతుందని సమాచారం.
సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో రానా విరాట పర్వంతో పాటు.. నాగచైతన్య లవ్ స్టోరీలో కథానాయికగా నటిస్తోంది. అలాగే… అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు వెర్షన్ లో కూడా కథానాయికగా నటించబోతున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు.. నితిన్ సినిమాలో కూడా అమ్మడు కథానాయిక గా నటించడానికి ఒప్పుకుందట. మొట్ట మొదటి సారిగా నితిన్ సరసన సాయిపల్లవి రొమాన్స్ చేయనుండడంతో ఈ ప్రాజెక్ట్ ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమా గురించి త్వరలోనే అనౌన్స్ మెంట్ రానుందట. మరి సాయిపల్లవి .. ఈ సినిమాకి ఏ రేంజ్ లో హైలైట్ కానుందో చూడాలి.
Must Read ;- ఫస్ట్ గ్లింప్స్ : థ్రిల్ చేసే నితిన్ బ్లైండ్ ‘మాస్ట్రో’