హీరోయిన్లు ఎవరైనా గ్లామర్ పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సిల్వర్ స్క్రీన్ పై జిగేల్ మంటూ మెరిసిపోవడానికి తహతహలాడుతుంటారు. ఓ సినిమా ఒప్పుకునే ముందు కూడా తన పాత్రలో ఎంత గ్లామర్ ఉందని చెక్ చేసుకుంటారు. కానీ హీరోయిన్ తమన్నా మాత్రం రివర్స్ లో మాట్లాడుతోంది. తనకు గ్లామర్ అక్కర్లేదంటోంది. మిల్కీ బ్యూటీగా టాలీవుడ్ లో తనకంటూ సెపరేట్ ఇమేజ్ తెచ్చుకుందామె. ఆమె అందాలకు ఫిదా అవ్వని కుర్రాడు లేడు. అలా పదేళ్లుగా తన గ్లామర్ డోస్ తో కుర్రకారును కిర్రెక్కిస్తూనే ఉంది ఈ సుందరి.
అలాంటి తమన్నా కాస్త ఇప్పుడు యూ-టర్న్ తీసుకుంది. తనకు గ్లామర్ పాత్రలు అక్కర్లేదంటోంది. అయితే ఆమె మాట్లాడుతోంది సిల్వర్ స్క్రీన్ గురించి కాదు, స్మాల్ స్క్రీన్ గురించి. అవును.. రీసెంట్ గా ఓటీటీలోకి ఎంటరైన ఈ ముద్దుగుమ్మ.. వెబ్ సిరీస్, ఒరిజినల్ కంటెంట్ కు సంబంధించి తనను గ్లామర్ డాళ్ గా చూడొద్దని చెబుతోంది. కేవలం తనను అందాల సుందరిగా చూడకుండా, మంచి నటిగా చూసి పాత్రలు ఆఫర్ చేయాలని కోరుతోంది.
ఆమె నటించిన ఓ వెబ్ సిరీస్ రీసెంట్ గా ఓ ఓటీటీలోకొచ్చింది. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అందులో ఆమె యాక్టింగ్ పరంగానే కాకుండా, గ్లామరస్ గా కూడా అదరగొట్టింది. ఈసారి మాత్రం గ్లామర్ లేకపోయినా పర్లేదు, నటించడానికి స్కోప్ ఉండే పాత్రలు కావాలని అడుగుతోంది తమ్ము డార్లింగ్. తమన్నా నటించిన మరో వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కు సిద్దంగా ఉంది. ఒకవిధంగా చెప్పాలంటే ఈ కరోనా కాలంలో వెబ్ సిరీస్ సేఫ్ అని చెప్పాలి.
Must Read ;- 20 నుంచి తమన్నా వెబ్ సిరీస్ ‘నవంబర్ స్టోరీ’