కంటోన్మెంట్ పాలక మండలి మాజీ ఉపాధ్యక్షుడు, టీఆర్ఎస్ నాయకుడు సాద కేశవరెడ్డి కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈటలతో పాటు తనలాంటి నాయకులపై కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు స్థానం లేదని, పనిచేసే నాయకులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ బోర్డు కోసం ఎంతో పాటుపడినా.. టీఆర్ఎస్ అధిష్టానం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. తాను కూడా ఈటల బాటలో నడుస్తానని, త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటానని స్పష్టం చేశారు.
must read ;- ఈటల బాటలో మరో నాయకుడు : టీఆర్ఎస్ కు తెలంగాణ సంపత్ గుడ్ బై











