నితిన్ హీరోగా.. సెన్సిబుల్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ అండ్ స్పోర్ట్స్ డ్రామా ‘చెక్’. ఉరిశిక్ష పడ్డ ఖైదీ.. చెస్ లో ఛాంపియన్ అయ్యే కథతో రూపొందిన ఈ సినిమా మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాగా.. మిశ్రమ స్పందన తెచ్చుకుంది. జైలు బ్యాక్ డ్రాప్ లోకి స్పోర్ట్ డ్రామాను ఇన్ ప్లాంట్ చేయడం కొత్తగా అనిపించినా.. దీనికి కమర్షియల్ టచ్ ఇచ్చి.. కొంత ఇల్లాజికల్ గా వెళ్ళడం.. అలాగే.. క్లైమాక్స్ ను మరీ బొత్తిగా పేలవంగా తీయడం మైనస్ అయిందనే విమర్శలు వచ్చాయి. దానికి తోడు కలెక్షన్స్ కూడా ఏమంత చెప్పుకొనే రీతిలో లేవు.
అందుకే చెక్ సినిమాకి సీక్వెల్ ఉంటుందో లేదోననే సందేహాలు తలెత్తుతున్నాయి. నిజానికి ఈ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ అయితే.. తప్పకుండా దీనికి సీక్వెల్ ఉంటుందని నితిన్ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో చెప్పాడు. అంతేకాదు సీక్వెల్ తీసేందుకు అనువుగా సినిమా క్లైమాక్స్ ను చిత్రీకరించారు. ఉరిశిక్ష పడ్డ ఖైదీ.. చివరికి జైలు నుంచి తప్పించుకోవడం తో సినిమా ఎండ్ అవుతుంది. అయితే రెండో పార్ట్ లో ఆ పాత్ర ఎక్కడుంది? ఏం చేసింది? పోలీసుల కళ్ళపడకుండా.. ఎలా గేమ్ అడుతుంది అన్న అంశాలతో రెండో పార్ట్ తీయాలనుకున్నాడు దర్శకుడు చంద్ర శేఖర్ .
కానీ ఇప్పుడేమో సినిమా బ్రేక్ ఈవెన్ కు చేరుకుంటుందో లేదో అనే సందేహం తలెత్తుతోంది. మరి ఏదైనా మిరాకిల్ జరిగితే.. చెక్ సినిమా సీక్వెల్ సందేహాలకు చెక్ పెట్టినట్టవుతుంది. చూద్దాం. ఏం జరుగుతుందో.