నరసాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మరో లేఖ సంధించారు. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలపై నాలుగు లేఖలు వదిలిన రఘురామరాజు, ఇవాళ మరో లేఖ రాశారు. ఎన్నికల ప్రచారంలో అగ్రిగోల్డ్ బాధితులకు హామీ ఇచ్చిన విధంగా ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు న్యాయం చేయాలని రఘురామరాజు లేఖలో కోరారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా వెంటనే రూ.1100 కోట్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు న్యాయం చేయాలని రఘురామరాజు లేఖలో కోరారు.
ప్రభుత్వ వైఫల్యాలే ఆయుధాలు
ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలే అస్త్రాలుగా ఎంపీ రఘురామరాజు రోజుకొక లేఖతో విరుచుకుపడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ సీపీఎస్ రద్దు, ఇంటికో ఉద్యోగం, సామాజిక ఫించన్ల పెంపు వంటి అంశాలను తన లేఖల్లో ప్రస్తావించిన రఘురామరాజు, ఇవాళ అగ్రిగోల్డ్ బాధితులకు ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. హైకోర్టు కూడా అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు చెల్లించాలని తీర్పు చెప్పిందని, అయినా అమలుకు నోచుకోలేదని ఆయన ప్రభుత్వ వైఫల్యాలను లేఖల ద్వారా ఎండగడుతున్నారు.
Must Read ;- పార్టీ నుంచి బహిష్కరించారా.. జగన్‌కు రఘురామరాజు లేఖ