మిల్కీ బ్యూటీ తమన్నా ఈమధ్య కాస్త వెనుకబడినట్లు కనిపించింది. డ్యాన్సుల్లో ఇరగదేసే ఈ భామ వెనుకబడిందంటే దూకుడు పెంచబోతుందని మనం అనుకోవలసి వస్తోంది. ఓటీటీ పుణ్యమా అని ఈ భామకు మళ్లీ మంచిరోజులు వచ్చినట్టే. హీరో సత్యదేవ్ సినిమాలకి ఇప్పుడు ఓటీటీల్లో భారీగా డిమాండ్ పెరిగిందనే సంగతి తెలిసిందే. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాతో సత్యదేవ్ గురించి ఇప్పుడు తెలుగుతో పాటు వేరే భాషల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి.
కన్నడలో భారీ హిట్ గా నిలిచిన ‘లవ్ మాక్ టైల్ ’చిత్రాన్ని తెలుగులో సత్యదేవ్ ని హీరోగా పెట్టి సినిమా తీయడానికి ఇటీవలే ఓ కన్నడ దర్శక నిర్మాత రెడీ అయ్యాడు. ఈ ప్రపోజల్ సత్యదేవ్ కి నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. అయితే హీరోయిన్ గా సత్యదేవ్ కి పక్కన ఎవర్ని తీసుకుందామనే డిస్కషన్ వచ్చినప్పుడు. సత్యదేవ్ నుంచి తమన్నా అయితే బాగుటుందనే సజెషన్ వచ్చిందట, దీంతో నిర్మాతలు తమన్నాని ఈ రీమేక్ లో ఒప్పించడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చిందని అంటున్నారు. దాదాపుగా తమన్నాకి ఈ రీమేక్ సినిమా ద్వారా రెండున్నర కోట్లు పారితోషికం లభించనుంది, అంతే కాదు ఈ రీమేక్ తో తమన్నా కనిపించేది కేవలం 20 నిమిషాలు మాత్రమే, అలానే 15 రోజలు డేట్స్ మాత్రమే తమన్నా ఇచ్చినందని తెలిసింది.
ఇక సత్యదేవ్ పారితోషికంగా 40 లక్షలు క్యాష్ తో పాటు ఈ సినిమా డిజిటల్ రైట్స్ లో 25 పర్సంట్ షేర్ తీసుకుంటున్నాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఓ చిన్న హీరో సరసన నటించేందుకు తమన్నా బాగానే డిమాండ్ చేసిందనే కామెంట్స్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో షికార్లు చేస్తున్నాయి. అన్నట్లు ఈ ప్రాజెక్ట్ కి గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ పెట్టారు. ఇంకా షూటింగ్ కూడా మొదలు కాకుండానే ఈ సినిమా ఆడియో రైట్స్ ని ప్రముఖ కన్నడ మ్యూజిక్ కంపెనీ ఆనంద్ ఆడియో వారు దాదాపు 75 లక్షలకు కొనుకున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించింది.











