ఎస్పీబీ కరోనాకు తానే కారణం అని, తనకు కరోనా సోకినట్టు పాజిటివ్ గా తేలినా కూడా తాను ఆయనతో షూటింగ్ కు హాజరయ్యానని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని సింగర్ మాళవిక ఖండించారు. మాళవికతో పాటు ఆమె కుటుంబ సభ్యలుకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే.. ఎస్పీబీకి రావడానికి తాను కారణం కాదని ఆమె వివరణ ఇచ్చుకున్నారు. తన పేరిట జరుగుతున్న ప్రచారం పై ఆమె సుదీర్ఘమైన ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వాస్తవాలు తెలియజెప్పే ప్రయత్నం చేశారు.
జులై 30,31 తేదీల్లో ఎస్పీ బాలసుబ్రమణ్యంతో సామజవరగమన టీవీ షో షూటింగ్ జరిగింది. ఆయనతో పాటు పాల్గొన్న గాయకుల్లో మాళవిక కూడా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఆమె వల్లే వచ్చిందనే ప్రచారం జరిగింది. అయితే తాను 31వ తేదీ మాత్రమే పాల్గొన్నానని.. తనతోపాటు చాలా మంది సింగర్లు ఆ రెండు రోజుల్లో కార్యక్రమాల్లో ఉన్నారని మాళవిక పేర్కొన్నారు.
నాకే గనుక కరోనా ఉండి ఉంటే.. ఎస్పీబీ కంటె ముందు నాతో పాటు మేకప్ రూంలో ఉన్న మిగిలిన ముగ్గురు ఫీమేల్ సింగర్లకు ఇతరుల్లో కొందరికి కూడా నేను అంటించి ఉండాలి కదా.. అని ఆమె వివరణ ఇచ్చారు.
ఎస్పీబాలుకు కరోనా పాజిటివ్ గా ఆగస్టు 5న తేలిందని, కొందరు సలహా ఇవ్వడంతో తాను 8న పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ గా తెలిసిందని అన్నారు. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులు, సోదరి అందరూ కరోనా పాజిటివ్ గా ఉన్నారు. ఎస్పీబీకి కరోనా రావడానికి తానే కారణం అన్నట్లుగా జరుగుతున్న ప్రచారం పట్ల మాళవిక పంతుల ఆవేదన వ్యక్తం చేశారు.
ఆమె సుదీర్ఘమైన ఫేస్ బుక్ పోస్టును పూర్తి వివరాల కోసం ఇక్కడ చదవండి.
https://www.facebook.com/malavika.singer.7/posts/10223769021802860











