ఏపీ పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి షాక్ తగిలింది. సాదారణంగా ఆయన అధికారులపై ఫిర్యాదులు చేయడం తక్కువ. కానీ, ఆయనకే కోపం తెప్పించారు నెల్లూరు మున్సిపాలిటీలోని ఓ అధికారి. నెల్లూరులోని పొదలకూరు రోడ్డులో ఉన్న తన క్యాంప్ ఆఫీస్ పరిసరాల్లో పరిశుభ్రత అస్సలు లేదంటూ మంత్రికి స్థానికులు ఫిర్యాదు చేయడంతో.., హెల్త్ ఆఫీసర్ తనని వచ్చి కలవాలని మంత్రి ఆదేశించారు. కానీ, ఆ అధికారి మంత్రిని కలవకపోగా..? కనీసం క్యాంపు కార్యాలయం పరిసరాల్లో పారిశుధ్య నివారణ చర్యలు కూడా తీసుకోలేదు. దీనిపై ఆగ్రహించిన మేకపాటి.., మున్సిపల్ అధికారి నిర్లక్ష్యంపై నేరుగా కలెక్టర్ చక్రధర్ బాబుకి లేఖరాశారు.
ఇప్పుడే ఇదే జిల్లా అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
అవినీతిలో కూరుకుపోయిన నెల్లూరు మున్సిపల్ ఉద్యోగులు మంత్రిని లెక్క చేయడం లేదంటే? ఇక సామాన్యులు పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.., మంత్రి రాసిన లేఖపై ఇంతవరకూ మున్సిపల్ కమిషనర్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకలేదు. దీనిపై మంత్రి కూడా అసహనంతో ఉన్నారు.











