వరుస సినిమాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘టక్ జగదీష్’ సినిమాలో నటిస్తున్నాడు. దీనికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతంఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత నాని ‘టాక్సీవాలా’ సినిమా డైరక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాపై టాలీవుడ్ లో ఒక ఇంట్రస్టింగ్ టాక్ వినిపిస్తోంది.
‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాలు చాల కీలకమని, ఆ సిన్నివేశాల్లో ఒక పాత్రకు హీరో నారా రోహిత్ అయితే బాగుంటుందని చిత్ర బృందం ఆయనను అప్రోచ్ అయిందని టాక్ నడుస్తోంది. స్టోరీ విన్న రోహిత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇప్పటికే రోహిత్ అనేక సినిమాల్లో గెస్ట్ రోల్ లో కనిపించిన విషయం మనకు తెలిసిందే. కాగా ఈ సినిమా కథ విషయానికి వస్తే సెకెండ్ హాఫ్ మొత్తం ఒక పురాతనమైన కోటలోనే ఎక్కువ భాగం నడుస్తోందని తెలుస్తోంది.
ముఖ్యంగా నాని రోల్ కి సంబంధించిన కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, కీలక సన్నివేశాలు చాల బాగుంటాయని, నాని కూడా ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడని అంటున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ రెండో వారంలో సెట్స్ పైకి తీసుకువెళ్లాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. నాని 27గా వస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అసలే నాని నటించిన ‘వి’ సినిమా రిజల్ట్ అటు ఇటుగా వచ్చింది. ‘టక్ జగదీష్’, ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలతో ఎలాగైనా హిట్ కొట్టాలని నాని భావిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించి నాని బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.