18 ఏళ్లుగా కెరీర్ లో బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్న ఓల్డ్ బ్యూటీ త్రిష. ఏజ్ బార్ అవుతున్నా సరే నేటి తరం కుర్ర హీరోయిన్లకి కూడా కాంపిటీషన్ అవుతుంది. అయితే ముందున్నంత స్పీడ్ ఇప్పుడు త్రిషలో లేదన్నది వాస్తవం. సినిమాలు కూడా తగ్గిపోయాయి.
తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు తగ్గాక త్రిష కన్నడలో కూడా కొన్నాళ్లు సినిమాలు చేసింది. అయితే కన్నడ ఆడియెన్స్ త్రిషని సరిగా రిసీవ్ చేసుకోలేదు. దీంతో త్రిష మలయాళంలో కూడా తన లక్ టెస్ట్ చేసుకుంది. మలయాళంలో కుర్ర హీరోలు సరసన కూడా త్రిషకు ఆఫర్లు వస్తున్నాయి.
ఇది పక్కన పెడితే త్రిషకు తాజాగా తమిళంలో కూడా భారీ ఎత్తున్న అవకాశాలు వస్తున్నాయని తెలిసింది. తమిళంలో ఏజ్ బార్ అవుతన్న హీరోలందరికీ త్రిష సోలో ఛాయస్ అయిపోయిందంటున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, విక్రమ్ తదితర హీరోలు తమ అప్ కమింగ్ సినిమాల్లో త్రిషను హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారు.
దీనికి కారణం తమిళంలో ఉన్న మరో సీనియర్ హీరోయిన్ నయనతార సైలెంట్‌గా వుమెన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకోవడమే, ఇక తాజాగా త్రిషకు తమిళంలో ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది. తెలుగులో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన జెర్సీని తమిళంలో హీరో విష్ణు విశాల్ తో రీమేక్ చేస్తున్నారు.
తెలుగులో శ్రద్ధా శ్రీనాధ్ పోషించిన పాత్రను తమిళంలో త్రిష పోషించనుంది. ఇది ఓ 8 ఏళ్ల పిల్లాడికి తల్లి పాత్ర, ఇప్పటివరకు ఇలాంటి ఏజ్ బార్ పాత్రలను త్రిష పోషించలేదు. మరి త్రిష చేస్తున్న ఈ ఫస్ట్ ఎట్మెంప్ట్ ని తమిళ ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.











