సెలబ్రిటీల కుటుంబంలో ఏది జరిగిన అది పండగే. సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి ప్రియదర్శిని పుట్టిన రోజు వేడుకలు జరుపుకునే ఫొటోలు వైరల్ గా మారాయి. దానికి కారణం ప్రిన్స్ మహేష్ బాబు ఆ వేడుకలో పాల్గొనడమే. ప్రియదర్శిని హీరో సుధీర్ బాబు భార్య. ఈ పుట్టినరోజు వేడుకలకు మహేష్ బాబు తో పాటు అతని తండ్రి కృష్ణ, తల్లి ఇందిర, మహేష్ బాబు అక్క మంజుల, నమ్రత, సుధీర్ బాబు తదితరులంతా పాల్గొన్నారు. ఓ ఫొటోలో ప్రియదర్శిని కేకు కట్ చేయడం, ఇంకో ఫొటోలో ఆ కుటుంబం మొత్తం కలిసి భోజనం చేయడం లాంటివి చూడవచ్చు. ఈ ఫొటోలను సుధీర్ బాబు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.

ఈ సందర్భంగా సుధీర్ బాబు ‘ఇది అలాంటి తేదీ.. నా జీవితంలో ప్రేమ పుట్టిన రోజిది. హేపీ బర్త్ డే ప్రియా’ అని పేర్కొన్నారు. ఇక మహష్ భార్య నమ్రత అయితే ‘ మా కుటుంబంలో చిన్న రాక్ స్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ పేర్కొన్నారు. ఈ కరోనా వచ్చాక సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎలాంటి కార్యక్రమం వచ్చినా అందరూ కలిసిమెలిసి తమ ఆత్మీయతలను పంచుకుంటున్నారు. ఒకప్పుడైతే జీవితం యాంత్రికంగా మారిపోయి కేవలం ఫోన్ లలోనే శుభాకాంక్షలు తెలుపుకుంటూ గడిపేవారు. కలిసి భోజనం చేసే అవకాశం కూడా ఉండేది కాదు.











