2013లో రిలీజ్ అయిన ఎన్టీఆర్ ‘బాద్షా’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది ‘రీతు వర్మ‘. ఈ సినిమాలో ఆమె కాజల్ కు చెల్లిగా నటించింది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’,’ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి సినిమాలు హిట్ అయినా రీతుకు మాత్రం పెద్దగా పేరు తెచ్చిపెట్టలేకపోయాయి. ఇక ‘పెళ్ళిచూపులు‘ సినిమా ఆమె సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా రీతు నటనకు మంచి పేరు, గుర్తింపు వచ్చింది.
తమిళ్, తెలుగు భాషలలో అనేక సినిమాలు చేసింది రీతు. ముఖ్యంగా కోలీవుడ్ లో రీతుకి మంచి డిమాండ్ ఉండనే చెప్పాలి. ఆమె సినిమాలోకి రాకముందు మంచి మోడల్ అన్న సంగతి తెలిసిందే. ఆమె మోడల్ ప్రపంచంలో కూడా దూసుకుపోయిందనే చెప్పాలి. మోడలింగ్ సమయంలో ఆమె ధరించిన ఫ్యాషన్ దుస్తులు ఇప్పటికీ ట్రేండింగ్ లోనే ఉన్నాయి. తాజాగా అమ్మడు మెగా డాటర్ సంగీత్ ఫంక్షన్ కు హాజరైంది. అతి కొంతమంది హాజరైన ఈ వేడుకలో రీతు వర్మ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. తను ధరించిన నల్లరంగు చీరలో రీతు మెరిసిపోయింది. అక్కడ ఉన్నవారందరి కళ్ళు ఆమెపైనే ఉన్నాయి. అంతలా అందంగా, చలాకీగా ఉన్నారు రీతు వర్మ.
Must Read ;- రియాల్టీ షో చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే.
కేవలం నల్లరంగు చీర, దానికి తగ్గ చెవి దుద్దులు, మేచింగ్ హీల్స్ మాత్రమే వేసుకుంది. అయినా సరే ఆమె ఎంజల్ గా కనిపించిందనే చెప్పాలి. ఇప్పుడు ఆమె సంగీత్ లో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన రీతు అభిమానులు ఆమె అందంతో ప్రేమలో పడిపోతున్నారు. నల్ల రంగు చీరలో ఆమె ఒక దేవతలా ఉన్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Also Read ;- రితూ వర్మకు వరుడు కావలెను