బుల్లితెరపై ప్రసారమవుతున్న ‘జబర్ధస్త్’ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ రష్మి గౌతమ్. తన అంద చందాలతో ప్రేక్షకులను టీవీలకు కట్టి పడేస్తోంది. ‘జబర్ధస్త్’ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో ఆమె సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంది. కాని ఆమె చేసిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఎప్పుడూ చిలిపిగా ఉండే రష్మికి సామజిక బాధ్యత కూడా ఎక్కువ. సమాజంలో జరిగే ప్రతీ విషయానికి స్పందిస్తుంది రష్మి. ముఖ్యంగా ఆమె చిన్న పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై స్పందించిన తీరు సామాన్య ప్రజలను సైతం కదిలించింది.

Must Read ;- ఇక్కడే కాదు..రాశీకి అక్కడా పెరిగాయి!
అంతేకాకుండా ఈమధ్య కాలంలో కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను ఎలా అతలాకుతలం చేసిందో మనకు తెలిసిన విషయమే. ఈ కరోనా సమయంలో ఎవరు ఎలా ఉన్నా పేదవారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. తినడానికి తిండి కూడా లేదు . కొంత మంది మంచి వ్యక్తులు పేదవారికి తమ వంతు సహాయం చేసి వారి ఆకలి భాదను తీర్చేవారు. మనుషులే ఇలా అయిపోతే మూగ జీవాల పరిస్థితి ఇంకెంత దారుణంగా తయారై ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి ముగా జీవాల కోసం కదిలి వచ్చింది రష్మి. తనవంతు సహాయం చేసి వాటి ఆకలి భాదను తీర్చింది.

ఆమె చేసిన పనికి రష్మి అభిమానుల నుండే కాకుండా సామాన్య ప్రజల నుండి కూడా మంచి స్పందన వచ్చింది. ఆమె చేసిన పనికి సోషల్ మీడియా ద్వారా ప్రజలందరూ మెచ్చుకున్నారు కూడా. కరోనా సమయంలో తమ వంతు సహాయం చేసిన కొంతమందికి మెగాస్టార్ చిరంజీవి తన చేతుల మీదుగా కరోనా వారియర్ అవార్డును ప్రదానం చేశారు. ఆ కొంతమందిలో చోటు దక్కించుకుంది రష్మి. ఆమె చిరు చేతుల మీదగా కరోనా వారియర్ అవార్డును అందుకుంది.
దీనిపై రష్మి తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించింది. ‘చల్లని సాయంత్రం వేళ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉంది. మీ ప్రశంసలకు కృతఙ్ఞతలు. నా చివరి శ్వాస వరకు ముగా జీవాల కోసం నా వంతు సహాయం చేస్తాను’ అని అన్నారు రష్మి. దానితో పటు కొన్ని ఫోటోలను జత చేసింది. ఇప్పుడు ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మికి తన అభిమానులు, నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు.
Also Read ;- బూతులైతే నా షో చూడకండి.. చాగంటి వారి ప్రవచనాలు వినండి











