తెలుగమ్మాయిలు మదర్ ల్యాండ్ లో ఎంత పాపులారిటీ తెచ్చుకున్నప్పటికీ.. వారిని నెత్తిమీద పెట్టుకొనేవి మాత్రం అదర్ ల్యాండ్సే. అదేనండీ.. ఇతర భాషా చిత్ర పరిశ్రమలు. మంచి మంచి సినిమాలు చేసి ప్రేక్షకుల మన్ననలు పొందినప్పటికీ.. మన దర్శకులకి వారి టాలెంట్ ఏమాత్రం పట్టకపోవడం విచారించదగ్గ విషయమే. గతంలో తెలుగులో మంచి సినిమాలతో హిట్ అందుకున్న చాలా మంది మన కథానాయికలు .. తమిళంలో బాగా షైన్ అయ్యారు. వరుస అవకాశాలు దక్కించుకొని ప్రేక్షకుల ఆదరాభిమానాలు నిండుగా మెండుగా పొందారు. అంజలి, స్వాతి రెడ్డి, శ్రీ దివ్య లాంటి ముద్దుగుమ్మలు.. తమిళ తంబీలకు ఆరాధ్య కథానాయికలయ్యారు.
ఇప్పుడు ఈ లిస్ట్ లోకి వచ్చి చేరింది మరో బ్యూటిఫుల్ హీరోయిన్ రీతూ వర్మ. ‘పెళ్ళిచూపులు’ సినిమాతో పదహారణాల తెలుగమ్మాయిగా కనిపించి.. అందం, అభినయం పరంగా మంచి మార్కులేయించుకుంది. ఆ తర్వాత ‘కేశవ’ అనే మరో సినిమాలో మాత్రమే కనిపించింది. ఆ సినిమా ఆశించని రీతిలో అలరించని కారణంగా.. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ ప్రస్తుతం నానీ ‘టక్ జగదీష్’ లో ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తోంది.
అయితే అంతలోనే .. రీతూ బేబ్ కి తమిళ పరిశ్రమ నుంచి పిలుపొచ్చింది. ఏకంగా మలయాళ లవర్ బాయ్. దుల్కర్ సల్మాన్ సరసన ‘కణ్ణుమ్ కణ్ణుమ్ కొల్లైయడిత్తాల్’ లో హీరోయిన్ గా నటించే అరుదైన అవకాశమొచ్చిపడింది. అదే సినిమా తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’ గా అనువాదమై.. రెండు భాషల్లోనూ భలేగా పే చేసింది. ఆ తర్వాత ఈ మధ్యే ఓటీటీలో విడుదలైన.. ‘పుత్తం పుదు కాలై’ ఆంథాలజీ మూవీలో ‘అవరుమ్ నానుమ్’ అనే ఒక ఎపిసోడ్ లో ఒక వృద్ధుడి మనవరాలిగా ఎమోషన్స్ బాగా పలికించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం విక్రమ్, గౌతమ్ మీనన్ మూవీ ‘ధ్రువ నక్షత్రం’ లో కథానాయికగా నటిస్తోంది. మొత్తం మీద అమ్మడి వరుస చూస్తుంటే.. ఆమెకు టాలీవుడ్ కన్నా కోలీవుడ్ లోనే అవకాశాల పరంగా బాగున్నట్టుంది. మరి ఆమె టాలెంట్ ను మన టాలీవుడ్ డైరెక్టర్స్ ఫ్యూచర్ లో అయినా గుర్తిస్తారో లేదో చూడాలి.











