యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెర పై కనిపిస్తే చాలు అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది ఎన్టీఆర్ బుల్లితెర పై కనిపిస్తే.. ఇంట్లోని కూర్చొని టీవీలో ఎన్టీఆర్ చూడడం అంటే ఇక అభిమానులకు పండగే. బిగ్ బాస్ సీజన్ 1కు హాస్ట్ గా ఎన్టీఆర్ చేయడం.. ఆ షోకు రికార్డ్ స్ధాయిలో టీఆర్పీ రావడం తెలిసిందే. ఆతర్వాత మళ్లీ బిగ్ బాస్ సీజన్ 2 కు కూడా ఎన్టీఆర్ హోస్ట్ గా వస్తారనుకున్నారు కానీ.. సినిమాల్లో బిజీగా ఉండడం వలన కుదరలేదు. ఎన్టీఆర్ నో చెప్పడంతో బిగ్ బాస్ సీజన్ 2కు హీరో నానిని హోస్ట్ గా చేసారు.
సీజన్ 3 అయినా ఎన్టీఆర్ ని తీసుకువస్తారనుకున్నారు అయితే.. కింగ్ నాగార్జున బిగ్ బాస్ 3కి హోస్ట్ గా వచ్చారు. సీజన్ 4 కూడా నాగార్జునే హోస్ట్. ఈ రియాల్టీ షో ఇప్పుడు ఎండింగ్ కి వచ్చింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఎన్టీఆర్ ఓ రియాల్టీ షోకు హోస్ట్ గా చేసేందుకు ఓకే చెప్పారట. ఇది బ్రేకింగ్ న్యూస్ అని చెప్పచ్చు. ఎందుకంటే.. ఓ వైపు ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ తో నెక్ట్స్ సినిమా చేయడానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రెడీగా ఉన్నారు కానీ.. డేట్స్ ఇవ్వలేదు. ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ వెయిట్ చేస్తూనే ఉన్నారు.
ఇలాంటి టైమ్ లో ఎన్టీఆర్ ఓ రియాల్టీ షోకు టైమ్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఈ షోను జెమిని టీవీ టెలికాస్ట్ చేయనుంది. ఈ షో కోసం అన్నపూర్ణ స్టూడియోలోని రెండు ఫ్లోర్ లను బుక్ చేసారు. అలాగే భారీ సెట్ వేస్తున్నారు. ఎన్టీఆర్ రియాల్టీ షో చేయనున్నారు అనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అసలు ఈ షో ఏంటి.? ఇందులో ఏం చెప్పబోతున్నారు.? ఎప్పుడు స్టార్ట్ కానుంది..? తదితర వివరాల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి.. ఈ షో ద్వారా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తారో చూడాలి.
Must Read ;- ‘ఆర్.ఆర్.ఆర్’ సెట్ లో బాలీవుడ్ బ్యూటీ.. !