మెగా డాటర్ నిహారిక పెళ్లి ఈ నెల 9న రాజస్ధాన్ లోని ఉదయ్ పూర్ లో చాలా గ్రాండ్ గా చేయనున్నారు. మెగా ఫ్యామిలీ అంతా అక్కడకు చేరుకుని సందడి స్టార్ట్ చేసారు. పెళ్లి కొడుకు గుంటూరు ఐజీ కుమారుడు జొన్నలగడ్డ చైతన్య. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ పెళ్లికి దాదాపు 120 మంది అతిథులు హాజరు కానున్నట్టు సమాచారం. గత రెండు రోజుల నుంచి అక్కడ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. సంగీత్ లో మెగా ఫ్యామిలీ మెంబర్స్ చేసిన సందడితో ఉదయ్ పూర్ ప్యాలెస్ లో పండగ వాతావరణం నెలకొంది.
సంగీత్ లో మెగా ఫ్యామిలీ మెంబర్స్ చేసిన డ్యాన్స్ ఒక ఎత్తు అయితే.. పెళ్లికొడుకు చైతన్య, పెళ్లి కూతురు నిహారిక చేసిన డ్యాన్స్ మరో ఎత్తు. ఈ డ్యాన్స్ సంగీత్ కి హైలెట్ గా నిలిచింది. నిహారిక.. తన కాబోయే భర్త చైతన్యతో బావ గారు.. బాగున్నారా.. అనే పాటకు డ్యాన్స్ చేయడం విశేషం. ఈ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. ఇలా వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. #NisChay అనే హ్యాష్ ట్యాగ్ తో ఇవన్నీ వైరల్ అవుతున్నాయి.
అక్కినేని నాగచైతన్య, సమంత పెళ్లి జరిగినప్పుడు చైసామ్ హ్యాష్ టాగ్ తో సోషల్ మీడియాలో వైరల్ అయితే.. ఇప్పుడు #NisChay అనే హ్యాష్ ట్యాగ్ తో వైరల్ అవుతుంది. చిరంజీవి డ్యాన్స్ ఎలా చేస్తారో తెలిసిందే. అలాగే ఏమాత్రం సందర్భం వచ్చినా చిరు డ్యాన్స్ వేసి తన సంతోషాన్ని అందరితో పంచుకుంటారు. ఇక తమ్ముడు కూతురు నిహారిక పెళ్లి కావడంతో మరింత సంతోషంతో డ్యాన్స్ చేస్తారు. అందుకనే చిరు డ్యాన్స్ చేసిన వీడియో ఎప్పుడు బయటకు వస్తుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. మరి.. నిహారిక సంగీత్ లో డ్యాన్స్ చేసిన వీడియోను స్వయంగా చిరునే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారేమో చూడాలి.
Must Read ;- వకీల్ సాబ్, ఉప్పెన రిలీజెస్ పై క్లారిటీ వచ్చేసింది..!