కథానాయిక అంటే అందానికి చిరునామాలా ఉండాలి .. మంచు తెరలపై తేలే జాబిలమ్మలా ఉండాలి .. తేనెవానలో తడిసే రాజహంసలా ఉండాలి. వాళ్లను చూస్తుంటే పుత్తడి బొమ్మలా .. పూల కొమ్మలా .. పున్నమి వెన్నెల్లా మనసు మనసుతో దోబూచులాడాలి. గుండె కోటపై గులాబీల వాన కురిసినట్టు .. కంటి తెరపై మేలిమి బంగారు కాంతి మెరిసినట్టుండాలి. వయసును మంత్రించే శక్తి ఉన్నది .. మనసును నియంత్రించే శక్తి లేనిదే అందమంటే. అందుకే కథానాయికలు అందంగా ఉండాలని అభిమానులు కోరుకుంటారు. అందంగా కనిపించాలనే కథానాయికలు ఆరాటపడతారు.
కథానాయికలు తమ కాస్ట్యూమ్స్ విషయంలో .. హెయిర్ స్టైల్ విషయంలో చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. యూత్ తమని గమనిస్తూ ఉంటారనీ .. అనుసరిస్తూ ఉంటారని వాళ్లకి తెలుసు. అందువల్లనే ట్రెండ్ కి తగిన దుస్తులను ధరించడానికి వాళ్లు ఎక్కువగా ఆసక్తిని చూపుతుంటారు. ఒక్కోసారి తాము ధరించిన దుస్తుల వలన వాళ్లే కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తుంటారు. కథానాయికలు గడపదాటినది మొదలు .. కారు దిగినది మొదలు కెమెరాకళ్లు వాళ్లను ఫాలో అవుతూనే ఉంటాయి. అందువలన ఎవరు ఎలాంటి దుస్తులను ధరించారు .. ఏ సందర్భంలో ధరించారనేది ఎప్పటికప్పుడు తెలిసిపోతూ ఉంటుంది.
ఇద్దరు కథానాయికలు ఒకే సందర్భంలో ఒకే రకం దుస్తులు ధరించినా ఆశ్చర్యమే కలుగుతుంది .. ఒక కథానాయిక ఒక సందర్భంలో ధరించిన దుస్తులను, మరో సందర్భంలో మరో కథానాయిక ధరించినా ఆశ్చర్యమే కలుగుతుంది. సమంత – రాశి ఖన్నా తమ అభిమానులను అలాంటి ఆశ్చర్యానికే గురిచేశారు. సమంత ‘ఓ బేబీ’ సినిమా ప్రమోషన్స్ సమయంలో మోడ్రన్ గా కనిపించే ఓ రకం దుస్తులను ధరించింది. క్రీమ్ కలర్ దుస్తుల్లో .. హెయిర్ లీవ్ చేసి .. అలా ఓ క్లిప్ పెట్టేసి ఓ స్వీట్ స్మైల్ ను విసిరి పడుచు మనసులకు రెక్కలు తొడిగేసింది.
ఇక అచ్చు అలాంటి డ్రెస్ నే ఇటీవల రాశి ఖన్నా ధరించడం విశేషం. ఆమె కూడా హెయిర్ లీవ్ చేసుకుని, కళ్ల వాకిళ్లలో భాషకందని భావాలను వెదజల్లేసింది. “ధైర్యంతో అడుగు ముందుకువేసి మీ కలలను నిజం చేసుకోండి .. మీ మాటలకన్నా చేతలు గొప్పవని నిరూపించండి” అనే అర్థంలో ఓ కొటేషన్ కూడా సెలవిచ్చింది. ఈ డ్రెస్ లో ఈ ఇద్దరిలో ఎవరు అందంగా కనిపిస్తున్నారంటే మాత్రం చెప్పడం కష్టమే. ఇద్దరూ పాలకడవలో వెన్నముద్దలే! .. సౌందర్యపు సరిహద్దులే!!
Must Read ;- ఈ వారం ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసిన అందగత్తెలు