తమిళ టీవీ నటి వీజే చిత్ర మరణానికి సంబంధించిన కేసు కొలిక్కి వచ్చింది. పోస్టు మార్టం రిపోర్టు ఆత్మహత్యగానే చెబుతున్నా ఆమె భర్త హేమంత్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేయక తప్పలేదు. ఆమె ఉరి వేసుకుని మరణించారన్న వార్త బయటకు వచ్చినా భర్త హేమంత్ పైనే అందరి అనుమానాలూ ఉన్నాయి. ముఖ్యంగా చిత్ర తల్లిదండ్రులు మాత్రం చిత్ర భర్త హేమంతే ఆమెను చంపాడని ఆరోపించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. చిత్ర తల్లి విజయ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈరోజు హేమంత్ ను అరెస్టు చేశారు. ఆరు రోజులుగా విచారించిన తర్వాత తమ దగ్గరున్న ఆధారాల ప్రకారం చిత్రను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన మరికొన్ని వివరాలను నిజరత్ పేట్ ఏసీపీ సుదర్శన్ వివరించారు. దీని ప్రకారం చిత్ర నటిస్తున్న షోలో ఓ సన్నివేశంపై హేమంత్ కుమార్ అభ్యంతరం పెట్టారు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగింది. ఈ గొడవలో హేమంత్ ఆమెను తోయగా ఆమె పడిపోయింది. ఈ కారణంగానే ఆమె మరణించిందని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఏసీపీ వివరించారు.
ఆమె మరణానికి సంబంధించిన మరికొన్ని వివరాలను పూర్త దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. చిత్ర విషయంలో అతను కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్లు వెల్లడైంది. ఆమె మరొకరితో సన్నిహితంగా మెలగడం కూడా హేమంత్ కోపానికి కారణమని తెలుస్తోంది. ఆర్థిక అంశాలు కూడా కారణమని అంటున్నా అది నమ్మశక్యంగా లేదు. వీరి నిశ్చితార్థం ఆగస్టులో జరిగింది.
ఆ తర్వాత నుంచి ఇద్దరి మధ్య తరచూ విభేదాలు తలెత్తుతున్నట్లు చిత్ర తల్లి విజయ చెబుతున్న మాటలు. చిత్ర, హేమంత్ ల మధ్య మరో వ్యక్తి ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఎవరనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. కేసు దర్యాప్తును ఇక్కడితో ముగించి వేస్తే ఆ వ్యక్తి పేరు కూడా బయటికి రాకపోవచ్చు. ఇందులో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి పేరు కూడా వెలుగులోకి వచ్చింది. అతను ఎవరన్న ప్రశ్నకు కూడా సమాధానం రాకపోవచ్చు. సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా దర్యాప్తు జరిపి ఉంటే పోలీసుల దగ్గర ఆ వివరాలు ఉండి తీరతాయి.
Must Read ;- చిత్ర, ఆర్య బెనర్జీ.. ఈ మరణాలకు ఏదీ సమాధానం?











