సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత టాలివుడ్ లోనే కాకుండా కోలివుడ్ లో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. కోలివుడ్ లో వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఆమె తమిళ్ లో నటిస్తోన్న చిత్రం ‘కాదువాకుల రెండు కాదల్’. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతార కూడా మరో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. 2020 ఫిబ్రవరి ప్రేముకుల రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు దర్శకనిర్మాతలు.
అయితే కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇంతకాలం తర్వాత ఈ సినిమా కథ సెట్స్ పైకి వెళ్లనున్నది. డిసెంబర్ చివరి వారంలో షూటింగ్ మొదలుకానున్నదని చిత్ర బృందం ఇటివలే ప్రకటించింది. షూటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈమధ్యన ‘కాదువాకుల రెండు కాదల్’ సినిమాలోని తన పాత్ర ను సమంత రివీల్ చేసింది. ఇందులో తనది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని, చిలిపిగా కూడా ఉంటుందని తెలిపింది. అలాగే కథను అనేక విధాలుగా మలుపు తిప్పే పాత్ర అని చెప్పింది. ఒక వైవిధ్యమైన సినిమాలో తాను ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉందని తెలిపింది సమంత.
విఘ్నేశ్ శివన్, విజయ్ సేతుపతి కలయికలో వచ్చిన మొదటి సినిమా ‘నానుమ్ రౌడీ ధాన్’ కోలివుడ్ లో మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమా ‘వాక్కుల రెండు కాదల్’ కావడంతో సినిమాపై కోలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.