యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. కరోనా వలన ఆలస్యం అయిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈమధ్యనే ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కించాడు దర్శకుడు రాజమౌళి. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయనున్నాడు. ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో తారక్ రెండు పాత్రలలో కనిపించనున్నాడని సమాచారం.
ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక త్రివిక్రమ్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తమిళ్ యువ దర్శకుడు, ఇప్పటి వరకు ఒక్క పరాజయం కూడా లేని అట్లీ దర్శకత్వంలో నటించనున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు అట్లీ ఒక పవర్ ఫుల్ కథను ఎన్టీఆర్ కు వినిపించాడని, ఆ కథలో తన పాత్ర నచ్చడంతో ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం. అయితే వీరిద్దరి కలయికలో రాబోతున్న సినిమా కోసం సాలిడ్ అప్డేట్ ఒకటి టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమా వచ్చే ఏడాది మధ్యలో అంటే.. జూలైలో మొదలవుతుందని టాలీవుడ్ లో గుసగుసలు వినపడుతున్నాయి. జూలైలో షూటింగ్ కు ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఇప్పటికే ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే త్రివిక్రమ్ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వెంటనే అట్లీ తీయబోయే సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు తారక్. ఈ వార్తపై పూర్తి క్లారటీ రావాలంటే అభిమానులు ఇంకా కొది రోజులు ఎదురు చూడక తప్పదు మరి.
Must Read ;- క్రేజీ మల్టీస్టారర్ భారీ షెడ్యూల్ పూర్తి











