డేటా సెంటర్ల వల్ల ఒక ప్రాంతం ఎలా డెవలప్ అవుతుందనే దానిపై మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల చెప్పిన మాటలు ఇప్పుడు వైజాగ్ భవిష్యత్తు గురించి జరుగుతున్న చర్చలకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాయి. అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్‌లో ఉన్న క్విన్సీ అనే చిన్న ఊరిలో డేటా సెంటర్ వచ్చాక ఆ ప్రాంతం ఎలా ఆర్థికంగా మారిపోయిందో ఆయన స్వయంగా వివరించారు. 2008 నుంచి అక్కడ వచ్చిన మార్పులను చూస్తే.. పన్నుల రూపంలో వచ్చే ఆదాయం ఏకంగా 12 రెట్లు పెరిగిందని, కొత్త స్కూళ్లు, హాస్పిటళ్లు, టౌన్ సెంటర్లు అన్నీ అక్కడొచ్చాయని ఆయన చెప్పారు. సత్య నాదెళ్ల చెప్పిన ఈ ఉదాహరణతో వైజాగ్‌లో డేటా సెంటర్లపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలకు చెక్ పడినట్లయింది. ఇవి కేవలం సర్వర్లు ఉండే గదులు మాత్రమే కావు..ఒక ప్రాంతం సమగ్రంగా అభివృద్ధి చెందడానికి, బోలెడు ఉద్యోగాలు రావడానికి ఇవి గట్టి పునాది లాంటివని ఆయన తేల్చిచెప్పారు.
ప్రస్తుతం విశాఖపట్నం, దాని చుట్టుపక్కల ప్రాంతాలు దేశంలోనే నంబర్ వన్ డిజిటల్, ఏఐ హబ్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా అదానీ గ్రూప్, గూగుల్‌తో పాటు మరికొన్ని పెద్ద కంపెనీలు కలిసి వైజాగ్‌లో వేల కోట్ల రూపాయలతో భారీ డేటా సెంటర్ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రభుత్వ సపోర్ట్‌తో మధురవాడ, అనకాపల్లి లాంటి ఏరియాల్లో వందలాది ఎకరాల భూమిని ఈ ప్రాజెక్టుల కోసం కేటాయించారు. ఈ ప్రాజెక్టులు వస్తే కేవలం పెద్ద ఎత్తున డేటా సెంటర్ల తయారవడమే కాదు.. సముద్రం లోపల నుంచి గ్లోబల్ సబ్‌సీ కేబుల్ కనెక్టివిటీ కూడా వైజాగ్‌కు అందనుంది.
అసలు ఈ డేటా సెంటర్ల వల్ల లోకల్ వాళ్లకు ఉద్యోగాలు వస్తాయా..అనే డౌట్లకు సత్య నాదెళ్ల మాటలే గట్టి ఆన్సర్ ఇస్తున్నాయి. క్విన్సీలో ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు వేలాది మందికి కన్స్రక్షన్ రంగంలో, అలాగే టెక్నికల్ నిపుణులుగా మంచి ఉపాధి దొరికిందని ఆయన చెప్పారు. సేమ్ అలాగే వైజాగ్‌లో రాబోతున్న ఈ డేటా సెంటర్ల వల్ల డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్ జాబ్సే కాకుండా.. క్లౌడ్ సర్వీసులు, ఏఐ స్టార్టప్‌లు, డేటా అనలిటిక్స్ రంగాలు చాలా పెద్ద లెవెల్‌లో గ్రోత్ సాధిస్తాయి. దీనివల్ల మన లోకల్ కుర్రాళ్లకు, యువతకు బోలెడు ఉద్యోగ అవకాశాలొచ్చి, విశాఖపట్నం ఇంటర్నేషనల్ లెవెల్‌లో హైలైట్ అవుతుంది.
కేవలం డిజిటల్ వసతులే కాకుండా, ఈ ప్రాజెక్టులకు కావాల్సిన కరెంట్ కోసం సరికొత్త పవర్ ట్రాన్స్‌మిషన్ లైన్లు, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌ను కూడా డెవలప్ చేస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి కూడా ఎలాంటి డ్యామేజ్ ఉండదు సరికదా, రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రంగానికి కొత్త జోష్ వస్తుంది. మొత్తంగా చూస్తే.. సత్య నాదెళ్ల చెప్పినట్టు ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు మామూలు జనాల లైఫ్ స్టైల్‌ను పూర్తిగా మార్చేస్తాయని, వైజాగ్‌కు మున్ముందు గోల్డెన్ డేస్ ఖాయమని ఈ పరిణామాలు అన్నీ స్పష్టంగా చెబుతున్నాయి.











