ఏపీలో స్థానికి ఎన్నికలు కొత్త కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. వీలైతే నామినేషన్లతోనే ఆపించడం కుదరకపోతే లెక్కింపుల్లో తేడాలు చేయడం అన్నట్లు ఉంది రాష్ట్ర ప్రభుత్వ తీరు. వీటిపై ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతుంటే.. ఎన్నికల కమిషన్ ఇప్పటికి చర్యలు చేపట్టడానికి సిద్ధమైంది. పైగా ఈ నెల 16 వ తేదీన కోర్టు ఇచ్చిన ఆదేశాలను గమనిస్తే..‘ఎన్నికలపై వస్తున్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని.. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపించాలని.. అభ్యర్ధులు ఎలాంటి భయాలకు లోనుకాకుండా ఎన్నికల ప్రక్రియ పాల్గొనేలా చేయాలని.. ఓటర్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడం ఎన్నికల సంఘం బాధ్యతగా వ్యాఖ్యానించింది.
రికార్డు తప్పనిసరి
కోర్టు ఆదేశాలను పాటిస్తూ.. ఎన్నికల కమిషన్, కలెక్టర్లకు, జిల్లా ఎన్నికల అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల లెక్కింపు ప్రక్రియను సీసీ కెమెరాలు లేదా వీడియో చిత్రీకరించడం లాంటి వాటి ద్వరా రికార్డు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఓట్ల లెక్కింపు సమయంలో కరెంటు పోవడం లాంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త ఏర్పాట్లు.. జనరేటర్లు, ఇన్వేర్టర్లు లాంటివి ఏర్పాటు చేయాలని ఆదేశాలలో పేర్కొంది.

రీకౌంటింగ్ నిబంధనలు పాటించాల్సిందే..
ఎక్కడైనా రీకౌంటింగ్ చేయాల్సివస్తే.. దానిని నిబంధనల ప్రకారం అములు చేయాలని కూడా ఎన్నికల కమిషన్ తమ ఆదేశాల్లో పేర్కొంది. ఓట్ల లెక్కింపు సమయంలో బయటి వారినేవరినీ అనుమతించరాదని ఈసీ ఆదేశించింది. చాలా తక్కువ ఓట్ల తేడా ఉన్నప్పుడు మాత్రమే రీకౌంటింగ్ చేపట్టాలని.. అదీ నిబంధనల ప్రకారం ఒక్కసారి మాత్రమే చేయాలని పేర్కొంది. అంతకంటే ఎక్కువసార్లు ఓట్ల లెక్కింపు చేయాలంటే అక్కడి వాతావరణం బట్టి నిర్ణయించవచ్చని ఆదేశాలలో తెలిపింది. రెండు అంకెల తేడా ఓట్లు ఉన్నప్పుడు రీకౌంటింగ్ చేయాల్సిన అవసరం లేదని.. ఒకవేళ నిర్వహించాల్సిన వస్తే అక్కడి పరిస్థితులను బట్టి ఎన్నికల అధికారి నిర్ణయించవచ్చని తెలిపింది.
ఈ ఆదేశాలను పాటిస్తూ.. కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, పోలీసులు.. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని చెప్పుకొచ్చింది.
Must Read ;- ఇంత అరాచకమైన ఎన్నికలు ఎన్నడూ చూడలేదు..