ఎంత సేపూ, సినిమాలూ, ఈవెంట్స్ , పార్టీలు, పబ్బులేనా? ప్రపంచంలో ఎన్నో అందమైన విషయాలున్నాయి. వాటి మీద స్పందిస్తే బాగుంటుంది కదా.. ఇలా ఆలోచించినట్టుంది మన అందాల రాశి.. రాశీ ఖన్నా. అందుకే కాసేపు సినిమాల గోల పక్కన పెట్టి ఎచక్కా ప్రకృతి, దాని లాభాలు, పర్యావరణ కాలుష్యం.. దాని నష్టాలు ఇలా.. వేరే టాపిక్ లోకి తన మనసుని డైవర్ట్ చేసింది అమ్మడు. ఎందుకంటే.. నిన్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం.
ప్రకృతి మీద కవిత్వం రాసేవారు కూడా.. రాసిన వేస్ట్ పేపర్స్ ను ఒకోసారి డస్ట్ బిన్ లో కాకుండా.. రోడ్డు మీద పడేస్తారు. అలాంటి వారి కన్నా వెయ్యిరెట్లు బెటరని నిరూపించింది అందాల రాశీ ఖన్నా. సంతోషం, శాంతి ఎక్కడుంటుందో అక్కడ పర్యావరణం పచ్చగా ఉంటుందని .. ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. నేడు, ప్రతీ రోజూ అని కేప్షన్ ఇచ్చి… పూల వనాలు, చెట్లు మధ్య అందంగా విహరిస్తూ వాటి మీద తన ప్రేమను చాటుకుంది. అమ్మడు పోస్ట్ చేసిన ఈ సందేశాత్మక వీడియోకి లక్షకు పైగానే కామెంట్స్ వచ్చిపడ్డాయి. అందరూ బాధ్యతను గుర్తెరిగిన రాశీ ప్రవర్తనని ప్రశంసిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగులన్నీ నిలిచిపోవడంతో .. రాశీ.. ఇంటికే పరిమితమైంది. దాంతో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయింది. తరచుగా తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే రాశీ ఖన్నా.. ఇలా ప్రతీ సందర్భానికి రియాక్ట్ అవడం తన హాబీగా పెట్టుకుంది. ప్రస్తుతం రాశీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Must Read ;- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున అందాలు వడ్డిస్తున్న ‘వార్’ బ్యూటీ